రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు నిర్దుష్టమైన ప్రణాళికలు అమలు చేయాలి

 


రాజమహేంద్రవరం  (ప్రజా అమరావతి);


రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు నిర్దుష్టమైన ప్రణాళికలు అమలు చేయాలని


జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. 


గురువారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సమీర్ శర్మ పేదలందరికీ ఇళ్లు, ఓటీఎస్, స్పందన,  వైద్య ఆరోగ్య, సచివాలయ తదితర అంశాలపై సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిపై అధికారులు దృష్టి పెట్టడం ద్వారా  వారంవారం లక్ష్యాలను నిర్దేశించి ప్రతి రోజూ ప్రభుత్వ లక్ష్యాలు మేరకు క్షేత్ర స్థాయి సిబ్బందితో సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు.   స్పందన ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం  వాస్తవ పరిస్థితిని ఫిర్యాదుదారులకు   తెలియ పరిచడం జరుగుతోందన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు.  జగనన్న లే అవుట్ , ఓటీఎస్, ఇండ్ల నిర్మాణాలు పై రోజు వారి లక్ష్యాలతో పనులు పర్యవేక్షణ చేస్తున్నట్లు కలెక్టర్  తెలిపారు.  సచివాలయ, అర్భికే, హెల్త్ క్లినిక్ భవనాలు, గ్రామ, వార్డు సచివాలయ తనిఖీలు పై సి ఎస్ సమీక్షించారు. వైద్య ఆరోగ్య ద్వారా 

రక్తహీనత పిల్లల మరియు బాలికలకు  పోషకాహార లోపలను గుర్తించి 


    సి ఎస్. వీసి లో  డిఆర్వో బి.సుబ్బారావు,  సిపిఓ పి.రాము, జిల్లా హౌసింగ్ అధికారి  బి. తారాచంద్, డిఎమ్ హెచ్ ఓ  స్వర్ణలత, ఆర్  తదితరులు పాల్గొన్నారు.

Comments