ఉపాధి పనులను, ఇంటర్మీడియట్ పరీక్షలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, పరిశీలించిన జిల్లా కలెక్టర్

 గోరంట్లమండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


*: ఉపాధి పనులను, ఇంటర్మీడియట్ పరీక్షలను,  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, పరిశీలించిన జిల్లా కలెక్టర్*


గోరంట్ల (శ్రీ సత్యసాయి జిల్లా), మే 14 (ప్రజా అమరావతి):


*శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్  గోరంట్ల మండలంలో విస్తృతంగా పర్యటించారు.   శనివారం ఉదయం  

గోరంట్ల మండలంలోని కరావుల పల్లి లో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనులను అకస్మికంగా తనిఖీ చేశిన జిల్లా కలెక్టర్ 

*ముందుగా ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఈరోజు ఎంత మంది కూలీలు ఉపాధి పనులకు వచ్చారు, ప్రతిరోజు ఎంత మంది కూలీలకు పనులకు వస్తున్నారు, ఇప్పటివరకు ఎన్ని రోజులు పని చేశారు, ఎంత కూలీ డబ్బులు వచ్చింది, తదితర వివరాలను కూలీలతో ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ మంది కూలీలు ఉపాధి పనులకు వచ్చేలా కూలీలకు అవగాహన కల్పించాలన్నారు. కూలీ డబ్బులు చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు 257 రూపాయల డబ్బులు వచ్చేలా పనిచేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం పనులను కూలీలు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కూలీల మస్టర్ లను తనిఖీ చేశారు.


*అనంతరం జిల్లా కలెక్టర్  గోరంట్లమండల కేంద్రంలో లోని SAPS  జూనియర్ కళాశాల నందు జరుగుతున్న ఇంటర్మీడియట్  రెండవ సంవత్సరం పరీక్షలను తనిఖీ చేశారు. విద్యార్థులకు అన్ని రకాల వసతి సదుపాయాలు కల్పించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. సజావుగా ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


కొండాపురం  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడమే మన ప్రధాన  కర్తవ్యమని జిల్లా కలెక్టర్ పి.  బసంత్ కుమార్  తెలిపారు.  వివిధఆరోగ్య పథకాలు సంబంధించిన కార్యక్రమాలు, ఆసుపత్రి సేవలు. టీకాలు, ఓపి నమోదు, 104, 108, తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్, సీజనల్ వ్యాధులు, వైద్య నిపుణులు హాజరు పట్టిక, సిబ్బంది హాజరు పట్టికను, మందుల పట్టికను,  వివరాలను ఆరా తీశారు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని  వైద్య సిబ్బంది నీఆదేశించారు.  నిరంతరం వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.సిబ్బంది హాజరు పట్టిన పరిశీలించారు. ప్రతి ఒక్క  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వెల్ నెస్  సెంటర్ గా  మార్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో   పుట్టపర్తి ఆర్డిఓ  భాగ్య రేఖ, ఏపీ డి రఘునాధ రెడ్డి, తాసిల్దార్ రామాంజనేయులు, డాక్టర్  పి రాజు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments