రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఈ గవర్నెన్స్ విధానం ద్వారా సంస్కరణలను తీసుకోవడం జరిగిందని రీజనల్ పి. యఫ్. కమీషనర్, -1 మనోజ్ కుమార్ పేర్కొన్నారు.
గురువారం స్థానిక మోరంపూడిలో ఈ పి ఎఫ్ కార్యాలయంలో పత్రికా విలేఖరుల సమావేశంలో రీజనల్ పి. యఫ్. కమీషనర్, -1, మనోజ్ కుమార్, అకౌంట్స్ ఆఫీసర్, డి. కృష్ణ లు పాల్గొన్నారు.
EPFO ద్వారా తీసుకువచ్చిన ప్రధాన సంస్కరణలు...
యూనిఫైడ్ పోర్టల్ ద్వారా మెరుగైన సర్వీస్ డెలివరీ
దరఖాస్తుల పరిష్కారం కోసం ఆటో సెటిల్మెంట్ విధానం లో ఎటువంటి మానవ సంబంధం లేకుండా కంప్యూటర్ లో రూపొందిన ప్రోగ్రాం మేరకు అర్హత ఉన్న క్లైయిములను పరిష్కారం చేయడం జరిగింది. 1,35,000 వేల క్లైయిమ్స్ రాగా వాటిలో 1,14,000 వెలు పైబడి మూడు రోజుల లో పరిష్కారం అయ్యాయి. ఇందుకోసం బహుళస్థాయి క్లెయిమ్ వ్యవస్థ ను ఏర్పాటు చేశాం. ఈ కేవైసీ, జన్మదిన తేదీలలో తప్పుల సవరణ, ఆధార్ సంబంధించిన మార్పులు చేర్పులు, వంటి సులభతరమైన సంస్కరణలను తీసుకు రావడం జరిగింది.
ఉమాంగ్ సర్వీస్ పోర్టల్ .. యాప్ ద్వారా పెన్షనర్లు వారి పాస్ బుక్ చూసుకునే వెసులుబాటు అందుబాటులోకి తీసుకువచ్చాం.
ప్రయాస్ పథకం ద్వారా పదవి విరమణ చేసిన రోజున పెన్షన్ విడుదల చేసేలా సంస్కరణలను తీసుకుని వచ్చాము.
పాక్షిక న్యాయ విచారణ కోసం వర్చువల్ హియరింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం
https //unified portal-emp.epfindia.gov.in/epfo/ వెబ్ సైట్ నందు సంపూర్ణ సమగ్ర సమాచారం అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
addComments
Post a Comment