ప్రశాంతంగా రెండో రోజు ఇంటర్ పరీక్షలు .. కలెక్టర్ డా. మాధవీలత

 


రాజమహేంద్రవరం  (ప్రజా అమరావతి);



ప్రశాంతంగా రెండో రోజు ఇంటర్ పరీక్షలు ..

కలెక్టర్ డా. మాధవీలత



జిల్లాలో రెండవ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలకు ఇంటర్ విద్యార్ధులు 17,169 మంది , ఓకేషనల్ విద్యార్థులు 1,647 మంది  హాజరయ్యారని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు.  రెండో రోజు కూడా ఇంటర్ పరీక్షలు ప్రశాంతం జరిగాయని తెలిపారు.


శనివారం  స్థానిక జూనియర్  కాలేజీ  (03014 - ఏ)  పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్  ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్  కె. మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో 49 పరీక్షా కేంద్రాల లో ఇంటర్ రెండవ సంవత్సరం కోసం 12,373 మంది, ఒకేషనల్ కోర్సు రెండవ ఏడాది పరీక్షలకు 5,290 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.


 రాజమండ్రి డివిజన్ పరిధిలో 32 కేంద్రాలలో రెండో ఏడాది ఇంటర్ కి  11,361  మందికి గాను 11,126   మంది హాజరు కాగా 235 మంది హాజరు కాలేదన్నారు.  ఒకేషనల్ కోర్సు కి సంబందించిన 1,012 కి గానీ మందికి గాను  933 మంది హాజరు కాగా 79 మంది హాజరు కాలేదని తెలిపారు.


కొవ్వూరు డివిజన్ పరిధిలో పరిధిలో ఉన్న 17  కేంద్రాలలో రెండవ ఏడాది ఇంటర్ పరీక్షలకి 4,517 మందికి గాను 4,396 మంది హాజరు కాగా 121 మంది హాజరు కాలేదన్నారు.  ఒకేషనల్ కోర్సు కి సంబందించిన 773 కి గానీ మందికి గాను 714 మంది హాజరు కాగా 59 మంది హాజరు కాలేదని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో కి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు అనుమతించ వద్దని, సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కె మాధవీలత స్పష్టం చేశారు. మెడికల్ క్యాంపు లో అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.


కలెక్టర్ వెంట ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి  జీ జీ కే నూకరాజు, జెడి ఐ. శారద, డి వి ఈ ఓ జేవిఎస్ ఎస్ సుబ్రహ్మణ్యం, హైపర్ కమిటీ అధికారి సత్యనారాయణ రెడ్డి,  తదితరులు ఉన్నారు.


Comments