సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మనుతో కలిసి సందర్శించిన పేర్నాటి దంపతులు.


విజయవాడ, (ప్రజా అమరావతి);

 సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మనుతో కలిసి సందర్శించిన పేర్నాటి దంపతులు.



  తెలంగాణ రాష్ట్రం, జనగామ హెడ్ క్వార్టర్ పరిధిలోని సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి సందర్శించిన  రాష్ట్ర నాయకులు  పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ పేర్నాటి హేమ సుష్మిత.

 ముందుగా సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో రెండు రాష్ట్రాల చైర్మన్లు, అధికారులు, రైతులు సమావేశమయ్యారు, సేంద్రియ వ్యవసాయం వాటిని సాగు చేసే పద్ధతులు, సేంద్రియ వ్యవసాయం యొక్క ఆవశ్యకతను కూలంకషంగా వివరించారు.

 తదుపరి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్న వివిధ రకాల పంటలను రైతులతో కలిసి సందర్శించారు, ప్రస్తుత ఆధునిక యుగంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వలన  పండించిన పంటల ద్వారా మానవజాతికి జరిగే నష్టాన్ని వివరించారు.

 రాబోయే తరాల్లో సేంద్రియ వ్యవసాయం ప్రముఖ పాత్ర పోషిస్తుందని, వీలైనంత త్వరగా రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేసే విధంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి చర్చిస్తామని తెలిపారు.


Comments