**ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు!**
**సర్వమత ఐకమత్యానికి, ప్రపంచశాంతికి రంజాన్ పండుగ ప్రతీక**
**రాష్ట్ర ప్రజలకు, ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాషా**
**అమీనియా ఈద్గా లో అదా ప్రార్థనలు**
కడప, మే 3 (ప్రజా అమరావతి)
: పవిత్ర రంజాన్ పండగ ముస్లిములకు ఎంతో ముఖ్యమైనదని,సర్వమత ఐకమత్యానికి, ప్రపంచశాంతికి ఈ పండుగ ప్రతీకని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క ముస్లిం ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాషా ఆకాక్షించారు.
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్(ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి ఎస్.బి అంజాద్ బాషా రాష్ట్ర ప్రజలకు, ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని ఆయన పేర్కొన్నారు.
మంగళవారం రంజాన్ పండుగను పురస్కరించుకుని స్థానిక బిల్టప్ కూడలిలోని అమీనియా ఈద్గా లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాషా పాల్గొని ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.....రంజాన్ పండుగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నమని ఈ పండుగను భక్తి శ్రద్దలతో ఉల్లాసంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు.రంజాన్ మాసంలో 30 రోజుల క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందన్నారు. అలాగే ముస్లిం సోదరులు సంపాదించిన సంపాదనలో పేద ప్రజలకు జకాత్ రూపంలో దాన ధర్మాలు చేయడం జరుగుతుందన్నారు.ఈ విదంగా మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని అన్నారు.బారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఎదగడానికి కుల మతాలకతీతంగా అందరూ సోదర భావంతో ముందుకు వెళ్తుండడమే అని అన్నారు.
ముస్లిం మైనారిటీల అభ్యున్నతి కోసం,రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, వారి సంక్షేమానికి ప్రతి ఏటా భారీగా నిధులు కేటాయించి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. ముస్లిం పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూత నందిస్తున్నదని తెలిపారు. మైనారిటీ నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణనిచ్చి, రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. అలాగే పేద మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నదన్నారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ద్వారా ముస్లిం విద్యార్థుల విదేశీ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తున్నదని తెలియజేసారు.
రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో ఉండాలని, పేద, బడుగు బలహీన మైనార్టీ వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అల్లాహ్ ఆశీస్సులు అందించి, రాష్ట్రం మరింత అభివృద్ధి బాటలో పయనించాలని ఆయన ప్రార్థించిన్నట్లు తెలిపారు. నగరంలో ని అమీనియా ఈద్గాలో ముస్లిం సోదరులతో పాటు ,హిందువులు క్రైస్తవ సోదరులు పాల్గొని కడప నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాషా ఆప్యాయంగా ప్రేమతో ముస్లిం సోదరులను అలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. .రంజాన్ పండుగలో పాలుపంచుకొన్న నగర ప్రజలందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
రంజాన్ పండుగ నేపథ్యంలో డిఎస్పీ శివా రెడ్డి నేతృత్వంలో పోలీసు శాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు అమీర్ బాబు, శ్రీనివాసులు,డిఎస్పీ శివా రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, అమీన్ పిన్ దర్గా గురువు హారిఫుల్ల హుస్సేని, ముస్లిం మత పెద్దలు,వైస్సార్ సిపి నాయకులు సుభాన్ బాష,తదితరులు హాజరయ్యారు.
addComments
Post a Comment