ఉపాధి హామీ పనులు, సచివాలయం, అర్భికే, జెడ్పీ హై స్కూల్ తనిఖీ



గోకవరం (ప్రజా అమరావతి); 



గోకవరం మండలం లో కలెక్టర్ సుడిగాలి పర్యటన


ఉపాధి హామీ పనులు, సచివాలయం, అర్భికే, జెడ్పీ హై స్కూల్ తనిఖీ



ఉపాధి హామీ పథకం ద్వారా సగటు వేతనం వీలైనంత ఎక్కువగా వచ్చేలా పనుల ఎంపిక చేయాలని  జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత  స్పష్టం చేశారు. 



బుధవారం గోకవరం మండలం జీ. కొత్తపల్లి, అచ్యుతాపురం గ్రామాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించారు. అందులో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పనులు, గ్రామ సచివాలయం, ఆర్బీకే సెంటరు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. 


ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, వేసవి దృష్ట్యా ఉపాధిహామీ పనులు చేపట్టే ప్రదేశాల్లో తగిన నీడ ఉండేలా చూడాలని , త్రాగునీరు, ఒ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసరమైన మందులతో కూడిన కిట్స్ కూడా ఫీల్డ్ సూ  పర్వైజెర్ పని చేసే ప్రాంతంలో  మరుగు దొడ్లు ఏర్పాటు చెయ్యవలసినదిగా అధికారులను ఆదేశించారు. మీమీ మండలాల్లో ఉపాధి హామీపనులను గుర్తించి వాటి లక్ష్యాలను సాధించడానికి సమన్వయం చేసుకోవాలన్నారు. కనీస వేతనం లభించేలా పనుల ఎంపిక ఉండాలన్నారు. రబీ సీజన్ ముగుస్తున్నందున , గ్రామాల్లో జాబ్ కార్డులు పంపిణీ కోసం ఆసక్తి ఉన్న లబ్ధిదారులను గుర్తించి పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. 


ఉపాధిహామీ పనుల్లో ఉన్న దివ్యంగురాలు అన్నవరం తో  కలెక్టర్ సంభాసించారు. మోటార్ మెకనైజ్డ్ ట్రై సైకిల్ కోసం ఈమె పేరు సిఫార్సు చెయ్యాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 


జగనన్న లే అవుట్ ను సందర్శించిన కలెక్టర్, ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.  ఇక్కడ 1083 మంది లబ్ధిదారుల కోసం అవసరమైన ఇళ్ళ స్థలాలను గుర్తించామన్నారు.  ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇసుక, ఐరన్, నీటి వనరులతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. రూ.15 వేలు  ఆర్థిక చేయుత నిచ్చి, బ్యాంకు లింకప్ ద్వారా ఇంటి నిర్మాణాలు ప్రారంభింప చేయాలన్నారు.   పేదలందరికీ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడానికి స్థానిక ప్రజా ప్రతినిధులను కలుపుకుని వెళ్ళాలని సూచించారు. శాసన సభ్యులు జ్యోతుల చంటిబాబు తో కలిసి అచ్యుతాపురం లో పర్యటించారు. అచ్యుతాపురం  గ్రామం కి చెందిన బావాజీ పేట- గుమ్మూలురు   మధ్య ఉన్న నిర్మిస్తున్న 33 కేవి విద్యుత్ లైన్ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు.


సచివాలయం, అర్భికే  సందర్శన : 


గ్రామ స్థాయిలో ప్రజల వద్దకు, రైతుల వద్దకు పారదర్శకతతో కూడిన మెరుగైన పరిపాలన అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు.  అభివృద్ధి చెందిన సమాజం కోసం సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు నిబద్దతతో పనిచెయ్యడం తోపాటు అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేరేలా చూడాలన్నారు. హాజరు పట్టికను తనిఖీ చేసి, విధిగా సిబ్బంది అందరూ మ.3 నుంచి 5 వరకు సచివాలయం లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సచివాలయఉద్యోగులందరూ సమయ పాలన పాటించారు.



జిల్లా పరిషత్  స్కూల్ తనిఖీ :


కామరాజు పేట  గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న  10వ తరగతి పరీక్షల నిర్వహణ తీరును  కలెక్టర్ డా మాధవీలత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులతో విద్యార్థులతో పరీక్షలకు సంబంధించిన పలు అంశాలను అడగడం జరిగింది.  పాఠశాల ప్రాంగణంలో ఉన్న మరుగుదొడ్ల ను పరిశీలించారు. పరిశుభ్రత తో కూడిన త్రాగునీటి వసతి, క్లాస్ రూం నిర్వహణ, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. 


అర్భికే సందర్శన..రైతులకు భరోసా : 


గ్రామస్థాయి లోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ఆయా గ్రామాల్లోనే  (కళ్ళేలు వద్ద) సరైన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చెయ్యడం జరుగుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా వరిసాగు చేసే గ్రామాల పరిధిలోని అర్భికే లలోనే  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు ఎవ్వరూ దళారులకు ధాన్యం అమ్మవద్దని, ప్రభుత్వమే కొనుగోలు చేసి, సదరు సొమ్మును నేరుగా రైతు ఖాతాలకు జమచెయ్యడం జరుగుతోందన్నారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, అటువంటి ఘటనలు ఎదురైతే వెంటనే అధికారులు ఖండన ఇవ్వాల్సి ఉందన్నారు. 


ఈ పర్యటనలో శాసన సభ్యులు జ్యోతుల చంటిబాబు, ఎంపిపి సుంకర శ్రీవల్లి, జెడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్,  డ్వామా పిడి ఏ. వెంకటలక్ష్మి, ఎం ఆర్ వో కె. పోసిబాబు, ఎండివో కె. కిషోర్ కుమార్, డి ఎస్పి కె వెంకటేశ్వర రావు, విద్యుత్ శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.



Comments