దావోస్ లో ప్రత్యేకంగా ఏపీ పెవిలియన్అమరావతి (ప్రజా అమరావతి);


*పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ప్రత్యేకతను ప్రపంచ స్థాయిలో చాటేందుకు సీఎం తొలి అంతర్జాతీయ పర్యటన : పరిశ్రమల మంత్రి అమర్ నాథ్* 


*కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లోగోను ఆవిష్కరించిన  పరిశ్రమల శాఖ  మంత్రి* 


*9 ప్రాధాన్య రంగాలపై తీర్చిదిద్దిన బుక్ లెట్ ను లాంచ్ చేసిన మంత్రి అమర్ నాథ్*


*దావోస్ లో ప్రత్యేకంగా ఏపీ పెవిలియన్


*


*సీఎం అధ్యక్షతన 13 అత్యున్నత ద్వైపాక్షిక సమావేశాలు, 35కి పైగా అత్యున్నత స్థాయి సమావేశాలు*


*ప్రపంచ నలుమూలల నుంచి హాజరవుతోన్న 2,200 మంది పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నాయకులు, ఆర్థికవేత్తలు*


*ముఖ్యమంత్రి జగన్ పాలనను కొనియాడి, ఆహ్వానించిన డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెండె ప్రశంసలను గుర్తు చేసిన మంత్రి*


*డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడుప్రోఫెసర్ క్లాస్ ష్వాబ్,  సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోనున్న ఏపీ*


“ప్రజలు , పురోగతి , అవకాశాలు” అనే  నేపథ్యంతో ప్రపంచ వేదికగా ఏపీలో ఉన్న అపార అవకాశాలను చాటేందుకు ఆంధ్రప్రదేశ్  దావోస్ వెళుతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు.  వెలగపూడి సచివాలయంలోని 5వ బ్లాక్ లో నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో  పరిశ్రమల శాఖ  మంత్రి అమర్ నాథ్ లోగోను ఆవిష్కరించారు.  ముఖ్యమంత్రి అందించిన ప్రజాకేంద్రీకృత పాలనకు సాక్ష్యంగా ఈ ఏడాది ప్రత్యేక లోగోను తీర్చిదిద్దినట్లు ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ “సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను” దశదిశలా చాటే విధంగా రూపొందించిన  బుక్ లెట్ ను కూడా మంత్రి అమర్ నాథ్ ఆవిష్కరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ చెప్పింది చెప్పినట్లు అమలు చేసిన నవరత్నాలు, పర్యావరణం, సాంఘిక సంక్షేమం, సుపరిపాలన వంటి 9 రంగాలతో కూడిన అంశాలకు ఈ బుక్ లెట్ లో ప్రాధాన్యమిచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. *డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెండె ఆహ్వానం..ఏపీ ప్రత్యేకతను చాటేందుకు సీఎం తొలి అంతర్జాతీయ ప్రయాణం : పరిశ్రమల మంత్రి అమర్ నాథ్* 


"కలిసి పని చేయడం, నమ్మకాన్ని పునరుద్ధరించడం" అనే   నేపథ్యంతో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధుల బృందం తొలి అంతర్జాతీయ పర్యటనకు సిద్ధమైనట్లు మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు.  కోవిడ్ -19 కారణంగా ప్రపంచమంతా  అనిశ్చితి. ఇలాంటి సమయంలో నాయకులు కలిసి పనిచేయాలని, నమ్మకాన్ని పునర్నిర్మించుకోవడానికి స్థిరమైన పరిష్కారాల దిశగా ప్రపంచ సహకారాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఏపీ సీఎంని భాగస్వామ్యం కావాలని  డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ ఆహ్వానం పలికిన విషయాన్ని పరిశ్రమల మంత్రి ప్రస్తావించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో  "పారదర్శకత, అధికార వికేంద్రీకరణ, సాంకేతిక ఆవిష్కరణల పునాదులపై ఆంధ్రప్రదేశ్‌ని నిర్మించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిబద్ధత" ప్రశంసనీయమన్న డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షులు బెర్జ్ బ్రెండె వ్యాఖ్యలను మంత్రి అమర్ గుర్తు చేశారు.  డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్జ్ బ్రెండే  ఆహ్వానం మేరకు హాజరవుతున్న ఏపీ ఈ సారి ప్రత్యేక ప్రణాళిక కసరత్తులతో ఆర్భాటాలు లేకుండా వెళుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 2,200 మంది పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నాయకులు, ఆర్థికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతుల ఆధ్వర్యంలో మే 22 నుంచి 26 వరకూ  వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరుగుతుందన్నారు. ఈ వార్షిక సమావేశానికి హాజరయ్యే ప్రముఖ ప్రఖ్యాత ప్రపంచ నాయకులలో  పైగా  ప్రముఖ అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల  మంత్రులు, ప్రపంచ వాణిజ్యవేత్తలు, కేంద్ర మంత్రులు, ప్రఖ్యాత భారతీయ వ్యాపారవేత్తలు, నాయకులు, రిలయన్స్ ఇండస్ట్రీస్, జూబిలెంట్ గ్రూప్, టాటా సన్స్, హీరో గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, భారతి ఎంటర్‌ప్రైజెస్ వంటి 200 మందికి పైగా హాజరవుతున్నట్లు తెలిపారు. వివిధ రంగాలలో వాణిజ్యం, అధునాతన నమూనాలు, గ్లోబల్ నెట్‌వర్క్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎంఎస్ఎమ్ఈలను మరింత బలోపేతం చేయడం, నైపుణ్యం, రీస్కిల్లింగ్ వర్క్‌ఫోర్స్, తయారీ,  గ్లోబల్ పోర్ట్-నేతృత్వంలోని అభివృద్ధి, ఎగుమతులను ప్రోత్సహించడం వంటి అంశాలలో ఏపీ భాగస్వామ్యవుతున్నట్లు మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఫోరమ్ మెంబర్ అసోసియేట్‌గా ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యమైనట్లు తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ ను మరింత వృద్ధిలో నిలబెట్టే దిశగా కలిసి పనిచేసేందుకు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడుప్రోఫెసర్ క్లాస్ ష్వాబ్,  సమక్షంలో ఒప్పందంపై సంతకం చేయబోతుందన్నారు.


*దావోస్ లో ప్రత్యేకంగా ఏపీ పెవిలియన్ : మంత్రి అమర్ నాథ్* 


విప్లవాత్మక మార్పుల దృష్ట్యా, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలను హైలైట్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్ స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, తయారీ రంగంలో అలవరుకోవలసిన అంశాలు, డీ కార్బనైజ్డ్ ఎకానమి వృద్ధి ప్రాధాన్యతలతో ప్రపంచ వేదిక ద్వారా   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గళం వినిపించేందుకు ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళిక కోసం సుస్థిరత వైపు సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి ప్రపంచ నాయకులు, పారిశ్రామికవేత్తలతో చేయి చేయి కలిపి పని చేయాలని యోచిస్తోంది. అందుకుగానూ  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహసోపేత, సంచలన నిర్ణయాల కారణంగా వేగంగా సాధించిన ప్రగతి, పారిశ్రామిక పురోగతిని ప్రపంచ నలుదిశలా చాటేలా దావోస్ లో ఏపీ పెవలియన్ ను ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టిన  సమగ్ర సామాజిక అభివృద్ధి విధానాలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ, గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల (రైతు సంబంధిత సేవలన్నింటికీ ఒకే కేంద్రం) ద్వారా వికేంద్రీకృత పాలన దిశగా రాష్ట్రం అందుబాటులోకి తీసుకువచ్చిన బలమైన నమూనా మార్పును ఏపీ పెవిలియన్ థీమ్ హైలైట్ చేస్తుందని మంత్రి అమర్ నాథ్ తెలిపారు. సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా ఆంధ్రప్రదేశ్ స్థిరమైన అడుగులు వేస్తున్న నేపథ్యంలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , ప్రతినిధుల బృందం రాష్ట్ర సుస్థిర అభివృద్ధి చర్యలను దీర్ఘకాల పెట్టుబడులుగా మలిచేందుకు  డబ్ల్యూఈఎఫ్-2022లో ప్రపంచ నాయకులను కలిసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే అంతర్జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దార్శనికతతో నవరత్నాల ద్వారా  ప్రజల ముంగిళ్లకు ప్రభుత్వ సేవలను చేరువ చేసే సంక్షేమ పథకాలు, దూరదృష్టితో నిర్దేశించుకుని ఆచరణలో చూపించే అభివృద్ధి  లక్ష్యాలు,  అన్ని రంగాల పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న ఏపీ భవిష్యత్ ను మరింత ముందుకు తీసుకువెళ్లే వ్యూహాలను చర్చించేందుకు ఏపీ కసరత్తు పూర్తి చేసిందన్నారు.*గ్లోబల్ కంపెనీలు, ఎంఎన్ సీ కంపెనీలు, వాణిజ్యవేత్తలతో ముఖ్యమంత్రి శిఖరాగ్ర సమావేశాలు*


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అధ్యక్షతన 13 అత్యున్నత ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో  సుమారు 35 గ్లోబల్ కంపెనీలు/ఎంఎన్ సీలు, ప్రపంచ స్థాయి నాయకులు , మేధావులతో శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించి  చర్చలు జరపనున్నట్లు మంత్రి అమర్ నాథ్ తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యాన్నిపెంపొందించడానికి సంబంధిత రంగాలలో అపార పెట్టుబడి అవకాశాలు, రెన్యువబుల్ ఎనర్జీ, సాంకేతిక సేవలు, కన్జూమర్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, లాజిస్టిక్స్, క్యాపిటల్ మార్కెట్స్, ఆర్థిక పరస్పర సహకార మార్గాలపై చర్చించేందుకు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం  ప్రధానంగా దృష్టి సారించిందన్నారు. జన సంక్షేమానికి పెద్దపీట వేస్తూ , ఏ పౌరుడు వెనకబడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలను కల్పిస్తూ  17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్న ఏపీ సుస్థిరాభివృద్ధి లక్షాన్ని సాధించిన రాష్ట్రాలలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మూడవ రాష్ట్రంగా నిలిచిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.


*దావోస్ పర్యటనలో ప్రధానంగా 3 కీలక సమావేశాలలో భాగస్వామ్యం కానున్న సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి*


*1.  23వ తేదీన వైద్యరంగంపై కీలక సమావేశం*


*2. 24వ తేదీన విద్య, నైపుణ్య రంగాలపై  అత్యున్నత స్థాయి సమావేశం*


*3. 24వ తేదీన డీకార్బనైజ్డ్ ఎకానమీ దిశగా మార్పుపై సమావేశం*


దావోస్ పర్యటన కోసం పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, చేనేత, జౌళి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్, ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి & శిక్షణ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పార్లమెంటు సభ్యులు పివి మిథున్ రెడ్డి, ఏపిఐఐసి ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీ ఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, ఇతర సీనియర్ ఐఎఎస్ అధికారుల ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి వెంట వెళుతున్నారు.


స్విట్జర్లాండ్ లోని దావోస్ లో నిర్వహిస్తోన్న 52వ ప్రపంచ వాణిజ్య సదస్సు ( వరల్డ్ ఎకనమిక్ ఫోరం - డబ్ల్యూఈఎఫ్)కు ప్రెసిడెంట్ జార్జ్  ఆహ్వానం మేరకు  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు హాజరవుతున్నట్లు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన వారిలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వారే ఉన్నట్లు మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన స్పష్టం చేశారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు అనే ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశ్రమలు నెరవేరుస్తున్నట్లు స్పష్టం చేశారు.


 వ్యవసాయం, పరిశ్రమలు, అత్యాధునిక తయారీ విధానం, విద్య, వైద్యం, పర్యావరణం, పర్యాటక, పునరుత్పాదక రంగాలపై ద్వైపాక్షిక  సమావేశాలలో ప్రధానంగా చర్చించనున్నట్లు ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది వెల్లడించారు.


సచివాలయం వేదికగా నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీ ఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సుదర్శన్ బాబు, రాజేంద్రప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం  దావోస్ కు పర్యటనకు సంబంధించిన సమాచారం కోసం సంప్రదించవలసిన వెబ్ సైట్ల వివరాలు*


https://apedb.gov.in/

https://www.apiic.in/#


*ఫేస్ బుక్ లింక్ :* facebook.com/APEDB/


*ట్విట్టర్ :*  https://twitter.com/AP_EDB


*లింక్డిన్ :* https://www.linkedin.com/company/official-andhra-pradesh-economic development-board/


*HASHTAG:* #APatWEF22


*వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2022కి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ కింద పొందుపరచిన లింక్ ని సంప్రదించగలరు :*


https://www.weforum.org/events/world-economic-forum-annual-meeting-2022

Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image