ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు .. జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలతరాజమహేంద్రవరం  (ప్రజా అమరావతి);


ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు 

.. జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత 


.. ఇంటర్మీడియేట్ అధికారులు 


అనివార్య కారణాల దృష్ట్యా మే 11 న బుధవారం నిర్వహించాల్సిన ఇంటర్ మొదటి  ఏడాది  పరీక్షలు  మే 25 కి వాయిదా వేసినందున,  గణితం పేపర్- I A , బోటనీ పేపర్- I,  సివిక్స్ పేపర్-I పరీక్షలను ఈరోజు నిర్వహించడం జరిగిందని  జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు.  బుధవారంతో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని పేర్కొన్నారు.


మొదటి  సంవత్సరం  గణితం పేపర్- I A , బోటనీ పేపర్- I,   సివిక్స్ పేపర్-I పరీక్షలకు ఇంటర్ విద్యార్ధులు 16,528 మంది , ఓకేషనల్ విద్యార్థులు 1,757 మంది పరీక్షలకు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్  మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో 49 పరీక్షా కేంద్రాల లో ఇంటర్ రెండవ సంవత్సరం  పరీక్షా కోసం 17,133  మంది, ఒకేషనల్ కోర్సు రెండవ ఏడాది పరీక్షలకు  2,052 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.. రాజమండ్రి డివిజన్ పరిధిలో 32 కేంద్రాలలో ఇంటర్ కి   12,296 మందికి గాను 11,958 మంది హాజరు కాగా  338 మంది హాజరు కాలేదన్నారు.  ఒకేషనల్ కోర్సు కి సంబందించిన 1,227  కి గానీ మందికి గాను 1,059 మంది హాజరు కాగా  168 మంది హాజరు కాలేదని తెలిపారు.


కొవ్వూరు డివిజన్ పరిధిలో పరిధిలో 17  కేంద్రాలలో ఇంటర్ పరీక్షలకి 4,837 మందికి గాను  4,570 మంది హాజరు కాగా  267 మంది హాజరు కాలేదన్నారు.  ఒకేషనల్ కోర్సు కి సంబందించిన కి  825 మందికి గాను   698 మంది హాజరు కాగా 127 మంది హాజరు కాలేదని తెలిపారు.


Comments