వైఎస్సార్ బీమా పథకం పై అవగాహన సదస్సు రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


" వైఎస్సార్ బీమా పథకం పై అవగాహన సదస్సు * బీమా మిత్రులు ఇంటింటి సర్వే ద్వారా అర్హులను పథకంలో నమోదు చేయండి


* 18 నుంచి 70 ఏళ్ల వరకు వయసు ఉన్న వారు ఇందులో చేరొచ్చు


* బీమా మొత్తం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది


* కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల వరకు పరిహారం చెల్లిస్తారు


డి.ఆర్.డి.ఏ  - పిడి శ్రీగిరి డేగలయ్యఅర్హులైన లబ్ధిదారులను గుర్తించి వై ఎస్ ఆర్ భీమా లో వారి పేర్లు నమోదు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. డేగలయ్య  పేర్కొన్నారు.


బుధవారం స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో సంక్షేమ కార్యదర్సులకి వై ఎస్ ఆర్ భీమా పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందిస్తోందన్నారు.  వీటిల్లో వైఎస్సార్ బీమా స్కీమ్ కూడా ఒకటన్నారు. . దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకి భరోసా ఇచ్చేలా వై ఎస్ ఆర్ బీమా ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. కుటుంబానికి పెద్దగా,  అండగా నిలిచేవ్యక్తి మరణిస్తే  అదుకునేందుకు వర్తించే విధంగా జగన్ సర్కార్ ఈ వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.  కుటుంబ పెద్ద సహజ మరణం పొందినా లేదంటే ప్రమాదవశాత్తు మరణించినా బీమా పరిహారం అందేలా వైఎస్సార్ బీమా పథకాన్ని తీర్చిదిద్దారని తెలిపారు. 

 వైఎస్సార్ బీమా పథకం కింద నమోదు చేసుకోవడం వల్ల ప్రమాదవశాత్తు లేదంటే సహజ మరణం పొందితే బీమా లభిస్తుందన్నారు. ఇందులో నమోదు కాబడిన వ్యక్తి  18 నుంచి 50 ఏళ్ల వ్యక్తి సహజంగా మరణిస్తే.. అప్పుడు వారి కుటుంబానికి రూ. లక్ష చెల్లిస్తారన్నారు. అలాగే 18 నుంచి 70 ఏళ్ల వయసులో ఉన్న వారు ప్రమాదంలో మరణించినా లేదంటే అంగవైలక్యం సంభవించినా రూ. 5 లక్షల వరకు లభిస్తాయన్నారు. బీమా మొత్తం నామినీ బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ అవుతుందని పేర్కొన్నారు. బీమా క్లెయిమ్ చేసిన 15 రోజుల్లోగా డబ్బులు వస్తాయని,  లబ్ధిదారుడి కుటుంబానికి తక్షణ ఉపశమనం కింద రూ.10 వేలు ఆర్థిక సాయం బీమా మిత్రా అందించడం జరుగుతుందన్నారు.


పేదలు, అసంఘటిత కార్మిక కుటుంబాలపై భారం పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం బీమా ప్రీమియం ఖర్చును భరిస్తుందని తెలిపారు. పథకానికి సంబంధించిన సందేహాల్ని నివృత్తి చేసేకునేందుకు 155214 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచారు. వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి అర్హత కలిగిన వారిని ఈ స్కీమ్‌లో నమోదు చేసే బాధ్యత తీసుకోవాలని, ఇందుకు వాలంటీర్ ద్వారా నమోదు ప్రక్రియ ను వేగవంతం చేయాలని కోరారు.


ఆర్ ఎమ్ సి .. డిపిఏం శరత్, ఏరియా కో ఆర్డినేటర్ కే. కాళీబాబు, ఏ పి ఎం ఆర్.జనార్ధన్, వై.సూరమ్మ, సంక్షేమ వార్డు కార్యదర్శులు హాజరయ్యారు.