ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించండి : రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి


రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అనంతరం ఈ నెల 5 న మొదటిసారి ముఖ్యమంత్రి జిల్లాకు రాక . . సమన్వయంతో పర్యటనను విజయవంతం చేయండి : జిల్లా అధికారులతో డిప్యూటీ సి ఎం కె. నారాయణస్వామి 


పూర్వ అనుభవాలతో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించండి : రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి* తిరుపతి, మే 2 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అనంతరం ఈ నెల 5న మొదటిసారి ముఖ్యమంత్రి గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు జిల్లాకు రానున్న సందర్భంగా అధికారులు సమన్వయంతో పర్యటనను విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి కె. నారాయణస్వామి అన్నారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, ఎంపి గురుమూర్తి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సత్యవేడు శాసన సభ్యులు ఆదిమూలం, ఎం ఎల్ సి మరియు ముఖ్యమంత్ర పర్యటనల కో ఆర్డినేటర్ తలసీల రఘురాం, ఎం ఎల్ సి కళ్యాణ్ చక్రవర్తి,  జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి, జే సి డి.కె బాలాజీ, ఎస్ పి పరమేశ్వర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమీషనర్ అనుపమ అంజలి లు కలసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన విధులు నిర్వహించిన గత అనుభవాలతో పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రం లోనే అతిపెద్ద కాన్సర్ ఆసుపత్రి ఎస్ వి కాన్సర్ ఆసుపత్రి కి ప్రారంభోత్సవం, చిన్న పిల్లలకు సంబంధించిన ఆసుపత్రికి శంఖుస్థాపన వంటి అనేక చారిత్రకమైన కార్యక్రమాలను ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నిర్వహించనున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.   

తిరుపతి జిల్లా ఏర్పడి మొదటిసారిగా గౌ. ముఖ్యమంత్రి ఈ నెల 5 న పర్యటించనున్నారని, పర్యటనను విజయవంతం చేయాలని విధులు కేటాయించబడిన అధికారులకు మంత్రులు సూచించారు. జగనన్న విద్యాదీవెన పథకం ఎస్.వి.యు స్టేడియం నుండి ప్రారంభించే కార్యక్రమం, బహిరంగం సభ ఏర్పాటు ఉన్నందున, లబ్దిదారులు, వారి తల్లిదండ్రులను ఆహ్వానించాలని సూచించారు. గౌ. ముఖ్యమంత్రి కొంత మంది విద్యార్థులతో, తల్లిదండ్రులలో ముఖాముఖి నిర్వహిస్తారని, ఆ పై గ్రూప్ ఫోటో దిగనున్నారని వివరించారు. అదే రోజు మొదటి కార్యక్రమంగా చిన్నపిల్లల మల్టీ స్పెషలిటీ ఆసుపత్రికి శంఖుస్థాపన, అక్కడి నుండే బర్డ్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన చిన్న పిల్లల గ్రహణ మొర్రి, వినికిడి సంబంధించిన కొత్త వార్డులను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని, ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆసుపత్రి ప్రారంభించనున్నారని తెలిపారు. పర్యటనలో చిన్నపాటి పొరపాటు కు కూడా తావు లేకుండా విజయవంతం చేయాలని తెలిపారు. 

డిసిసిబి చైర్మన్ రెడ్డెమ్మ, తిరుపతి నగర ఉప మేయర్ అభినయ్ రెడ్డి, టిటిటి బోర్డు మెంబెర్ పోకల అశోక్ కుమార్, డి ఆర్ ఓ శ్రీనివాస రావు, ఆర్డిఓ కనక నరసా రెడ్డి, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.