గ్రామ,వార్డు వాలంటీర్ ల సేవలు వెలకట్టలేనివి**గ్రామ,వార్డు వాలంటీర్ ల సేవలు వెలకట్టలేనివి


**


**రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాష**


**వాలంటీర్ల ఉత్తమ సేవలకు పురస్కారాలు**


కడప , మే 7 (ప్రజా అమరావతి):- గ్రామ,వార్డు వాలంటీర్ల సేవలు  వెలకట్టలేనవి, ప్రభుత్వ సేవలందించడంలో  సచివాలయ వ్యవస్థ ముఖ్య భూమిక పోషిస్తున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాష అన్నారు.


శనివారం స్థానిక  రామాంజనేయపురంలోని బాలాజీ ఫంక్షన్ హాలు నందు 1,2,3,4,5 వార్డు లకు సంబంధించి సచివాలయ వార్డు వాలంటీర్ల సేవా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.


ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాష  మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థపై ఎంతో నమ్మకంతో ప్రభుత్వ పథకాలను వారి ద్వారా ప్రజల వద్దకు చేర్చడం జరుగుతుందన్నారు. 

గ్రామ ,వార్డు సచివాలయ వ్యవస్థలు మన రాష్ట్రంలో తప్ప   ఇతర ఏ రాష్ట్రా లలోనూ లేవన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సచివాలయ  వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ,కుల, మత,పార్టీ లకతీతంగా  అవినీతి, వివక్షత లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ అందించడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. 

ప్రతి నెల 1 వతేది సూర్యోదయానికి ముందే  తలుపు తట్టి అవ్వా తాతలకు  పించలను అందజేస్తున్నారన్నారు.పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడం లో దేశంలో ఎక్కడా లేని విదంగా అర్హులైన 31 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయడం  చరిత్రలో నిలిచిపోతుందన్నారు.క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత  మన ప్రభుత్వానికే  చెల్లుతుందన్నారు.


ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని, ప్రభుత్వ పథకాలు ప్రజల గడపకు చేరుస్తున్న మానవతా మూర్తులు వాలంటీర్లని కొనియాడారు. .  రాబోయే రోజులలో వాలంటీర్లు మరింత బాగా పనిచేసి వైయస్ ఆర్ జిల్లాకే కాక రాష్ట్రా నికి మంచి పేరు తీసుకురావాలన్నారు.ప్రతిభ చూపిన వాలంటీర్లను గుర్తించిన ప్రభుత్వం సేవా మిత్ర, సేవ రత్న, సేవా వజ్ర పేర్లతో సత్కరిస్తోందన్నారు. 


కోవిడ్‌ సమయంలో,వరదలు సంభవించి నపుడు వాలంటీర్లు సైనికుల్లా పనిచేశారన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి వాలంటిర్ల మీద పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా మరింత కష్టించి పని చేయాలని కోరారు.ప్రభుత్వం అమలు చేస్తున్న  పథకాలను ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యేలా వివరించాలన్నారు.


ఈ సందర్భంగా  ప్రజలకు ఉత్తమ సేవలందించిన 1,2,3,4,5  వార్డు లకు సంబంధించి 167 మంది  వాలంటీర్లను అభినందిస్తూ  సేవా మిత్ర పురస్కారాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాష అందజేశారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రమణారెడ్డి, అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, కార్పోరేటర్లు చెన్నయ్య, ముక్కర సుబ్బారెడ్డి,సుదర్శన్ రెడ్డి, బండి జయ్యమ్మ,షఫీ,వార్డు ఇంచార్జిలు రమణ , బండి ప్రసాద్,గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.