గుంటూరు (ప్రజా అమరావతి);
బాల బాలికలలో సృజనాత్మకతను పెంచుదాం.
- సాంఘిక సంక్షేమ శాఖా మాత్యులు మేరుగ నాగార్జున.
ఆంధ్రప్రదేశ్ లోని లక్షలాది బాలబాలికలలో సృజనాత్మకతను,
ప్రశ్నించే లక్షణాన్ని పెంపొందించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఐక్యంగా కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు మేరుగ నాగార్జున పేర్కొన్నారు.అమరావతి ఒలంపియాడ్ పౌండేషన్ అవార్డుల ప్రధానోత్సవానికి డాక్టర్ మేరుగ నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు.ఈనెల 14వ తేదీ శనివారం గుంటూరులోని మద్య విమోచన ప్రచార కమిటీ కార్యాలయంలో జరిగిన సభకు మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు
డా"మేరుగ నాగార్జున ప్రసంగిస్తూ
నాడు-నేడు కార్యక్రమాల ద్వారా విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సంభవిస్తున్నాయని అన్నారు.అమరావతి ఒలంపియాడ్ పౌండేషన్ డైరెక్టర్ డి.లక్ష్మణరావు ప్రత్యేక కృషి జరిపి పిల్లల లో దాగి ఉన్న మేధాశక్తిని వెలికితీయడానికి లెక్కలు,డ్రాయింగ్,చేతివ్రాత లల్లో ఐదువేల మందికి పరీక్షలు నిర్వహించడం గొప్ప కార్యక్రమంగా అభివర్ణించారు.శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు ప్రసంగిస్తూ తల్లిదండ్రులు పిల్లలపై మానసిక ఒత్తిడి చేయవద్దని, పిల్లల అభిరుచులు,వారి శక్తి సామర్థ్యాలను గుర్తించి పిల్లల ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ పిల్లలు బహుముఖ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చెందాలని,ఆటలు,సంగీతం డ్రాయింగ్ తదితర విభిన్నమైన కార్యక్రమాలను ప్రోత్సహించాలని కోరారు.విద్యార్థులు బట్టి పట్టడం మాని పాఠ్యాంశాలను అవగాహన చేసుకుని క్షుణంగా
లోతుగా అధ్యయనం చేయాలని కోరారు.పని సంస్కృతిని గౌరవించాలని,జ్ఞాన సముపార్జనే లక్ష్యంగా కృషి చేయాలని హితవు పలికారు.నాలుగు రాష్ట్రాల్ల లోని 50 విద్యాసంస్థలలో ఐదు వేల మందికి పరీక్షలు నిర్వహించారు.వారిలో అవార్డులు పొందిన 40 మంది బాలబాలికలను డాక్టర్ మెరుగు నాగార్జున గారు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ రెసిడెన్సియల్
కళాశాల మాజీ ప్రిన్సిపాల్ దేవరపల్లి పేరిరెడ్డి,దీక్షిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు కృష్ణ,జన చైతన్య వేదిక జిల్లా కార్యదర్శి తుళ్లూరి సూరిబాబు,పిడుగురాళ్ల స్కాలర్స్ విద్యాసంస్థల అధినేత జి.శ్రీనివాస్ రెడ్డి,సెయింట్ ఆంటోనీ విద్యాసంస్థల డైరెక్టర్ ప్రభావతి,షేక్ ఫరీద్ లతో పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
addComments
Post a Comment