తీర్చి దిద్దిన జిల్లా కలెక్టర్ ఛాంబర్ బుధవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభం రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


తీర్చి దిద్దిన జిల్లా కలెక్టర్ ఛాంబర్ 


బుధవారం ఉదయం  శాస్త్రోక్తంగా ప్రారంభం 
తూర్పుగోదావరి బొమ్మురు లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో బుధవారం ఉదయం కలెక్టర్,  జాయింట్ కలెక్టర్,  డిఆర్ఓ ఛాంబర్ లను జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ప్రారంభించారు. 


అనంతరం కలెక్టరేట్ పరిధిలో వివిధ కలెక్టరేట్ సెక్షన్ లు ఏర్పాటుకు సంబంధించిన పనులను కలెక్టర్, ఇతర అధికారులు  పరిశీలించి తగిన సూచనలు చేశారు.తొలుత కలెక్టరేట్ కి చేరుకున్న కలెక్టర్ డా. కె. మాధవీలత  వేద పండితులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ తో కలిసి కలెక్టర్ ఆధునీకరించి కలెక్టర్ ఛాంబర్ ను ప్రారంభించారు. అనంతరం జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లని ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఐశ్వర్యా రస్తోగి, జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, డి ఆర్ ఓ బి. సుబ్బారావు, రాజమండ్రి ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, ఇతర శాఖల అధికారులు కలెక్టరేట్ సిబ్బంది,  తదితరులు పాల్గొని కలెక్టర్ మాధవీలత కు అభినందనలు తెలియజేశారు.Comments