ఆంధ్రప్రదేశ్ మరో ఆఫ్ఘానిస్తాన్


ఆంధ్రప్రదేశ్ మరో ఆఫ్ఘానిస్తాన్

ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ ను వెంటనే అరెస్టు చేయాలి


- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు 

అమరావతి (ప్రజా అమరావతి);

రాష్ట్రాన్ని వైసీపీ నాయకులు క్రైమ్ క్యాపిటల్ గా మార్చారు. నిందితులను అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతుంటే వారిమీద పోలీసులు, వైసీపీ గూండాలు దాడికి దిగడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. కాకినాడలో సుబ్రమణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ రెడ్ హ్యాండెండ్ గా దొరికినా పోలీసులు అరెస్టు చేయకుండా నిందితులను కాపాడుతూ బాధితులను వేధించడం దుర్మార్గం. పోస్టుమార్టం కోసం సుబ్రమణ్యం కుటుంబీకులను పోలీసులు వేధిస్తున్నారు. పోలీసుల తీరును ప్రశ్నించినందుకు మృతుడి భార్యపైన చేయిచేసుకోవడం వైసీపీ రాక్షస మనస్తత్వానికి నిదర్శనం. ముఖ్యమంత్రి విహార యాత్రకు వెళుతూ వైసీపీ మూకలను ప్రజల మీదికి వదలి వెళ్లాడు. ఆఫ్ఘానిస్తాన్ కన్నా దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. సంఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా బాధిత కుటుంబాన్ని వైసీపీ నేతలు ఎందుకు పరామర్శించలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. బాధిత కుటుంబానికి అండగా నిలబడినందుకు తెలుగుదేశం పార్టీ నేతలు, దళిత సంఘాలపై దాడులకు దిగుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ ను అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది. Comments