ముప్పాళ్ళ యువతికి అండగా 'మహిళా కమిషన్'
- అత్తింటి వేధింపులపై
మీడియా కథనాన్ని సుమోటోగా స్వీకరణ
- చందర్లపాడు పోలీసుల దర్యాప్తు పై నివేదికకు ఎస్పీకి లేఖ
అమరావతి (ప్రజా అమరావతి):
అత్తింటి వేధింపులకు సంబంధించి తనకు న్యాయం జరగలేదని ఎడ్లబండిపై ఢిల్లీకి ప్రయాణం కట్టిన ఓ యువతికి రాష్ట్ర మహిళా కమిషన్ అండగా నిలబడింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామా మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన నవ్యతకు స్థానిక పోలీసు స్టేషనులో అన్యాయం జరిగిందంటూ ఆమె అన్నయ్యతో పాటు ఎడ్లబండిపై ఢిల్లీకి ప్రయాణమైన విషయం గురువారం మీడియాలో రావడంతో మహిళా కమిషన్ దృష్టిసారించింది. కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెంటనే ఈ విషయంపై ప్రాథమిక వివరాలు సేకరించి సుమోటో కేసుగా స్వీకరించారు. చందర్లపాడు పోలీసు స్టేషనులో బాధితురాలి ఫిర్యాదుపై జరిగిన దర్యాప్తు నివేదిక.. వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలను పంపాలని ఎన్టీఆర్ జిల్లా ఎస్పీకి ఆమె మహిళా కమిషన్ నుంచి లేఖను పంపారు.
addComments
Post a Comment