ఉజ్వల భవిష్యత్తుకు డీకార్బనైజ్డ్‌ ఎకానమీకి మద్ధతు పలకాలన్న సీఎం

 

దావోస్‌ (prajaamaravathi);


*ఏపీ ఆధ్వర్యంలో ట్రాన్సిషన్‌ టు డీకార్బనైజ్డ్‌ ఎకానమీ పై సెషన్‌*

*కర్బన రహిత ఆర్ధిక వ్యవస్థకు ఏపీ దిక్సూచిగా పేర్కొన్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*


*ఉజ్వల భవిష్యత్తుకు డీకార్బనైజ్డ్‌ ఎకానమీకి మద్ధతు పలకాలన్న సీఎం


*

*33వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌కు ఏపీలో అవకాశాలున్నాయన్న సీఎం*

*ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ కంపెనీలకు ఆహ్వానం*


*గ్రీన్‌ హైడ్రోజన్‌ వినియోగం దిశగా ఏపీ సీఎం చూపిన చొరవ ఈ రంగంలో యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలవనుంది: నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్ కాంత్‌*

*కర్బన రహిత ఆర్థిక వ్యవస్థకు ఏపీ కేంద్రంగా మారుతోందన్న అమితాబ్‌కాంత్‌*


*ప్రపంచంలో తొలిసారిగా గ్రీన్‌ ఎనర్జీలో భాగంగా ఏపీలో పెట్టబడులు పెడుతున్నట్టు వెల్లడించిన ఆదిత్యమిట్టల్‌*

*కర్నూలులో చేపడుతున్న హైడ్రో పంప్డ్‌ ప్రాజెక్టులో తాము భాగస్వామ్యం అవుతున్నట్టు వెల్లడి*

*ఏపీ ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు సానుకూలంగా ఉన్నాయని ప్రశంస.*

*ఏపీలో భవిష్యత్తులో పెట్టుబడిని రెట్టింపు చేయనున్నాం*


*దావోస్‌:*

ట్రాన్సిషన్‌ టు డీకార్బనైజ్డ్‌ ఎకానమీపై దావోస్‌లో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. ఉజ్వల భవిస్యత్తుకోసం దీనికి మద్దతు పలకాలన్నారు. సెషన్‌లో సీఎం ప్రారంభ ఉపన్యాసం చేశారు. నీతి ఆయోగ్‌ (ఇండియా) సీఈఓ అమితాబ్‌ కాంత్, ఆర్సిలర్‌ మిట్టల్‌ సీఈఓ ఆదిత్య మిట్టల్, గ్రీన్‌కో గ్రూపు ఎండీ అండ్‌ సీఈఓ అనిల్‌ చలమలశెట్టి, దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌  ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌ ఈ సదస్సులో పాల్గొన్నారు. కేపీఎంజీ గ్లోబల్‌ హెడ్‌ రిచర్డ్‌  సెషన్‌ మోడరేటర్‌గా వ్యవహరించారు. 


డీ కార్బోనైజ్డ్‌ ఎకానమీ దిశగా ఇంధన, పారిశ్రామిక రంగాల పరివర్తన. ఇంధన రంగంలో భవిష్యత్తులో జీరో కార్బన్‌ దిశగా.. అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలు,గ్రీన్‌ ఎనర్జీలో భాగంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి. తదితర అంశాలపై ఈ సెషన్‌లో చర్చ జరిగింది. 


*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...* 

కర్బన రహిత యంత్రాంగం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఈ ప్రయత్నానికి మనం మద్దతు ఇవ్వకపోతే భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. పర్యావరణ, సామాజికాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం అన్నది మన బాధ్యత. కర్బన రహిత ఆర్థిక వ్యవస్థ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ దిక్సూచిగా నిలబడనుంది. ఇక్కడకు రావడానికి కొద్ది రోజుల క్రితమే నేను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో 5230 మెగావాట్ల ఇంటిగ్రేడెట్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ రెన్యువబుల్‌ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టే కార్యక్రమంలో పాల్గొన్నాను. ఒకేచోట 1650 మెగావాట్ల సామర్ధ్యం గల పంప్డ్‌ స్టోరేజీ... ఇది ఒక బ్యాటరీ తరహాలో పనిచేస్తుంది. దీనికి అనుసంధానంగా 3 వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్రాజెక్టు రానుంది. 900 మెగావాట్ల పవన విద్యుత్‌ కూడా ప్రాజెక్టు కూడా ఇక్కడే రానుంది. మొత్తం 5,230 మెగావాట్ల ప్రాజెక్టు ఇది. 

ఈ విధానంలో ఒక డ్యామ్‌ నిర్మిస్తాం. అందులో కేవలం 1 టీఎంసీ నీరు ఉపయోగిస్తాం. దీన్ని ఉపయోగించి...  విద్యుత్‌ వినియోగం అత్యధికంగా ఉన్నప్పుడు (పీక్‌ అవర్స్‌లో) నీటిని వదిలి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తాం. వినియోగం తక్కువగా ఉన్నప్పుడు (నాన్‌ పీక్‌ అవర్స్‌లో) మరలా నీటిని రిజర్వాయరులోకి వెనక్కి లిప్ట్‌ చేస్తాం. అప్పుడు పవన, సౌర విద్యుత్‌ వాడుకుంటాం. ఫలితంగా 1650 మెగావాట్ల ఫర్మ్‌ పవర్‌ అందుబాటులోకి వస్తుంది. ఇది చాలా మంచి అవకాశం. దీనివల్ల 24 గంటలపాటు పగలు, రాత్రి కూడా పవర్‌అందుబాటులోకి వస్తంది. చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఇది స్ధిరమైనది, ఆర్థికంగా బలమైనది. 


వినియోగం తక్కువగా ఉన్న సమయంలో(నాన్‌ పీక్‌  అవర్స్‌లో) ... పవన, సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఈ విద్యుత్‌ను ఉపయోగించుకుని... నీటిని మరలా రిజర్వాయరులోకి పంపింగ్‌ చేస్తాం. ఇది చాలా సులువైన మెకానిజమ్‌.


మనం 15,16 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ గురించి మాట్లాడుతున్నాం. కానీ వాస్తవానికి  33వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. ఆ మేరకు ఏపీలో విస్తృతంగా అవకాశాలున్నాయి. ప్రపంచనలుమూలల నుంచి వచ్చి ఇందులో భాగస్వాములు కావచ్చు. సంప్రదాయ పరిశ్రమల నుంచి సంప్రదాయేతర పరిశ్రమలకు కూడా మార్పుచెందవచ్చు. 

సంప్రదాయ పరిశ్రమ నుంచి గ్రీన్‌ పరిశ్రమగా మారడంతో పాటు..ఈ పవర్‌ను ఉపయోగించుకుని హైడ్రోజన్, అమ్మోనియా కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఎలక్ట్రాలసిస్‌ పద్ధతిలో నీటి డీశాలినైజేషన్‌ ప్రక్రియ కూడా చేయవచ్చు. భవిష్యత్తులో ఇవన్నీ సాకారమవుతాయి. వీటన్నింటికీ ఆంద్రప్రదేశ్‌ మీకు స్వాగతం పలుకుతుంది. 


*డీకార్భనైజేషన్‌ పై చర్చ జరగాల్సిన అవసరంఉంది.* 

డీకార్భనేజైషన్‌ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మైలురాయిగా నిలుస్తాయి.  5230 సౌర, పవన, పంప్డ్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టును ఒకే వేదికపై ఏర్పాటు చేయడం ఇందుకు నిదర్శనం. ఇందులో 1650 మెగావాట్స్‌ పంప్డ్‌ స్టోరేజీ అంటే బ్యాటరీ పవర్‌. ఎలాంటి హానికరం కాని బ్యాటరీ. కేవలం ఈ 1650 మెగావాట్లు మాత్రమే కాదు.. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ ఈ రంగంలో మరింత విస్తృతంగా పెట్టుబడులును ఆహ్వానిస్తోంది. ఈ రంగంలో ఆసక్తి ఉన్న ఎవరికైనా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. పర్యావరణం పరిరక్షణపట్ల సానుకూల దృక్ఫదం ఉన్నవారెవరైనా ముందుకు వస్తే సాదర స్వాగతం పలుకుతాం. 



*అమితాబ్‌ కాంత్, నీతి ఆయోగ్‌ సీఈఓ:*

*గ్రీన్‌ హైడ్రోజన్‌ వినియోగం దిశగా ఏపీ సీఎం చూపిన చొరవ ఈ రంగంలో యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలవనుంది.*


– ప్రపంచంలో కర్బన కాలుష్యానికి భారత్‌ కారణం కాదు. భారత్‌లో కర్బన ఉద్గార కారకాల తలసరి వినియోగం చాలా తక్కువ. అయితే కర్బన రహిత పారిశ్రామికీకరణ ప్రక్రియలో ప్రపంచంలోనే భారత్‌ తొలి దేశంగా నిలవాల్సి ఉంది. ఇది ఒక సవాల్‌ మాత్రమే కాదు. అందివచ్చిన ఒక అవకాశంగా చూడాల్సి ఉంది. 

ఎందుకంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, భారత్‌లో ఒక్కో కిలో వాట్‌ హవర్‌ (కేవీహెచ్‌) విద్యుత్‌ ఉత్పత్తిలో 2.7 సెన్స్‌ పునరుత్పాదకాలు ఉత్పత్తి అవుతున్నాయి. అంటే ఒక్కో కిలో వాట్‌ హవర్‌కు దాదాపు రూ.1.99 అన్నమాట. ఆ విధంగా కాప్‌–21 సమావేశంలో నిర్దేశించుకున్న ఎన్‌డీసీ లక్ష్యాన్ని సాధించిన ఏకైక దేశంగా (జీ–20 దేశాలు కాకుండా) భారత్‌ నిలుస్తోంది.

ఇప్పుడు భారత్‌ ముందున్న సవాల్‌ ఏమిటంటే, ఒక్కో కిలో వాట్‌ హవర్‌ (కేవీహెచ్‌) విద్యుత్‌ ఉత్పత్తిలో 2.7 సెన్స్‌ పునరుత్పాదకాలు ఉత్పత్తి అవుతుండగా, దాన్ని సగానికి అంటే, 1.35 సెన్స్‌కు తీసుకురావాల్సి ఉంది. తద్వారా హరిత ఉదజని (గ్రీన్‌ హైడ్రోజన్‌) సాధించి, ప్రపంచంలోనే దీనికి ఒక ముఖ్య కేంద్రంగా నిలవాల్సి ఉంది. ఒక్కో కిలో హరిత ఉదజని ధర దాదాపు 4 డాలర్ల నుంచి 4.25 డాలర్ల వరకు ఉంటుంది. దాన్ని 2025 నాటికి 2.25 డాలర్ల నుంచి 2.5 డాలర్ల వరకు.. అదే విధంగా 2030 నాటికి ఇక డాలర్‌కు తీసుకురావాల్సి ఉంది. అయితే ఇది అతి తక్కువ వ్యయానికే పునరుత్పాదకాలు పెంచినప్పుడే సాధ్యమవుతుంది. ఎందుకంటే హరిత ఉదజని ఉత్పత్తిలో 70 శాతం పునరుత్పాదకాలది కాగా, 10 శాతం విద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించింది కాగా, మిగిలిన 20 శాతం ఆ ప్లాంట్‌కు సంబంధించి ఉంటుంది. 

ఆ విధంగా పునరుత్పాదకాలు పెంచి, హరిత ఉదజని ఉత్పత్తి చేయలేకపోవడంతో మనం చూశాం.. విద్యుత్‌ గ్రిడ్‌ సమస్యను కాలిఫోర్నియాలో సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. అందుకే నిర్విరామంగా గ్రీన్‌ పవర్‌ (హరిత విద్యుత్‌..కాలుష్య రహిత విద్యుత్‌) ఉత్పత్తి చేయాల్సి ఉంది. 

దీనికి సంబంధించి ఇప్పుడే యువకుడు, ఉత్సాహవంతుడైన ముఖ్యమంత్రి చెప్పారు.. రాష్ట్రంలో ఒకేచోట సౌర, పవన, జల విద్యుత్‌ ప్లాంట్‌ ద్వారా చౌకలో కాలుష్య రహిత విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టబోతున్నట్లు. ఆ విధంగా ఒకేచోట సుమారు 1650 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే, ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాంట్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒకవేళ అదే విధంగా 23 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయగలిగితే, భారత్‌లో ముఖ్యమైన కర్బన రహిత కేంద్రంగా నిలుస్తుంది. తద్వారా ‘కర్బన రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా పరివర్తన’లో యావత్‌ ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలుస్తుంది. 

మొత్తం శక్తి రంగంలో విద్యుత్‌ రంగం వాటా 18 శాతం మాత్రమే. మిగిలిన 82 శాతం ఇతర రంగాలకు సంబంధించింది. రిఫైనరీ, స్టీల్‌ ప్లాంట్లు, ఫర్టిలైజర్, దూర ప్రాంతాల రవాణాలో వినియోగం. ఎందుకంటే పునరుత్పాదకాలతో వాటిని నడపలేం. అందుకే ఇప్పుడు ప్రపంచం ముందున్న సవాల్‌ హరిత ఉదజని. అందుకే ఫర్టిలైజర్, స్టీల్, రిఫైనరీ, షిప్పింగ్‌ రంగాలు కూడా గ్రీన్‌ హైడ్రోజన్‌ వినియోగం దిశగా మారాల్సి ఉంది. ఎవరు ఆమోదించినా ఇది వాస్తవం. ఆ దిశలో ఏపీ సీఎం చూపిన చొరవ ఈ రంగంలో యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలవనుంది.


*ఆదిత్య మిట్టల్‌. ఆర్సెలర్‌ మిట్టల్‌ గ్రూప్‌. సీఈఓ:*

*ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల విధానాలు*


 *ప్రభుత్వంతో ఇక ముందు కూడా కలిసి పని చేస్తాం.*


*ఏపీలో భవిష్యత్తులో పెట్టుబడులు రెట్టింపు చేయనున్నాం.*



– ఆంధ్రప్రదేశ్‌లో మేము భారీ పెట్టుబడి పెట్టడం జరిగింది. రాష్ట్రంలో గ్లోబల్‌ రెన్యువబుల్‌ ప్రాజెక్టు కోసం గ్రీన్‌కో కంపెనీ భాగస్వామ్యంతో కలిసి పని చేస్తున్నాము. అది మా కంపెనీ లక్ష్యాన్ని చూపుతుంది. ఆర్సెలర్‌ మిట్టల్‌ గ్రూప్‌ 27 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయినా రెన్యువబుల్‌ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది. అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అక్కడి ప్రభుత్వ విధానాలు పెట్టుబడికి ఎంతో సానుకూలంగా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఏర్పాటవుతున్న ప్లాంట్‌ను నేను స్వయంగా సందర్శించాను. అక్కడ జరుగుతున్న పనులు, ఒకేచోట మూడు రకాల విద్యుత్‌ ఉత్పత్తి కానుండడం, అలాగే తక్కువ నీటి వినియోగం, ఇంకా జరగనున్న పునరుత్పాదకాల ఉత్పత్తి నిజంగా ఎంతో ఆకట్టుకున్నాయి. అక్కడ 650 మిలియన్‌ డాలర్లు..  (దాదాపు రూ.5000 కోట్లకు పైగా) పెట్టుబడి సమకూర్చడం జరిగింది. అక్కడ రోజంతా 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరగనుండడం నిజంగా అద్భుతం. అక్కడ భవిష్యత్తులో పెట్టుబడిని రెట్టింపు చేయనున్నాం. పునరుత్పాదకాలు, హరిత ఉదజని ఉత్పత్తి కోసం మా వంతుగా పూర్తిగా చొరవ చూపుతాం. అన్ని విధాలుగా అనుకూల విధానాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఇక ముందు కూడా కలిసి పని చేస్తాం.

Comments
Popular posts
రైతు పండించిన పంటను కచ్చితంగా ఇ–క్రాపింగ్‌ చేయాలి:
Image
భారత త్రో బాల్ జట్టు కెప్టెన్ శ్రీ చావలి సునీల్ కి ఆర్థిక సహాయం క్రింద 25 లక్షల చెక్కును అందించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కే. రోజా
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image
దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ను ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్*
Image
వీఆర్వో లు రెవెన్యూ చట్టాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలు చేయాలి : జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అనంతపురం,(ప్రజాఅమరావతి ): ఆగస్టు 27: నూతనంగా పదోన్నతులు పొందిన గ్రామ రెవెన్యూ అధికారులు చట్టాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ప్రజలకు సక్రమంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సూచించారు. గురువారం నూతనంగా పదోన్నతి పొందిన వీఆర్వోలకు 2వ రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చేసి గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం స్థాపన కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో విఆర్వోలు అంతా మెరుగ్గా పనిచేసి ప్రభుత్వ లక్ష్యసాధనకు బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని అనుభవజ్ఞులైన సీనియర్లతో నివృత్తి చేసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ నిర్దేశించిన ఉత్తర్వుల మేరకు వీఆర్వో లు నాలుగు విభాగాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇందులో రెవెన్యూ భూ రికార్డులు, సామాజిక సంక్షేమం, అభివృద్ధి, పోలీసు తదితర విభాగాల వారీగా విధులు నిర్వర్తించాలన్నారు. రెవెన్యూ కు సంబంధించి అన్ని గ్రామ అకౌంట్లు, భూ రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు. నీటి పన్ను సెస్ తో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన వసూళ్లు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ భూములను తనిఖీ చేయాలన్నారు. సర్వే రాళ్లను ప్రతి ఏటా రెండు సార్లు పరిశీలించాలని, రాళ్లు లేనిచోట ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ భూములు, చెట్లు, చెరువులు, ఇతర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత విఆర్ఓ లపై ఉంటుందన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ రికవరీ చట్టం కింద రికవరీ చేయాల్సి వస్తే ఆ ఆస్తుల వివరాలు అందించి అధికారులకు సహకరించాలన్నారు. అలాగే పోలీసు విధులకు సంబంధించి రెవెన్యూ అధికారులు మెజిస్ట్రేట్ అధికారాలు వినియోగించే సమయంలో వీఆర్వోలు సహాయకులుగా పనిచేయాలని, ఎలాంటి అనుమానిత సమాచారాలు తెలిసినా వాటిని పోలీసులకు అందించాల్సి ఉంటుందన్నారు. నేరాలు జరిగిన సమయంలో ఆధారాలతో వాస్తవ నివేదికలు సమర్పించాలన్నారు. సామాజిక సంక్షేమం, అభివృద్ధి, విధులకు సంబంధించి వివిధ ప్రభుత్వ పథకాలను అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. అంటరానితనం నిర్మూలనలో బాధ్యతగా పని చేయాలని, పౌరసరఫరాల విషయంలో అధికారులకు సహకారం అందించాలన్నారు. పంట నష్టం జరిగినప్పుడు ఆ నష్టం అంచనా కు సంబంధించి వ్యవసాయ అధికారులకు సహకారం అందించాలన్నారు. తహశీల్దార్, సబ్ కలెక్టర్, ఆర్డిఓ, జిల్లా కలెక్టర్, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆదేశాల మేరకు విధులను వీఆర్వోలు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. అలాగే గ్రామాలలో అవసరమైన సమాచారాన్ని ప్రజలందరికీ చేరువుగా తీసుకువెళ్ళే క్రమంలో దండోరా వేయించడం, లీగల్ నోటీసులు జారీ ప్రక్రియ లాంటి విధులు కూడా వీఆర్వోల పరిధిలో ఉంటాయన్నారు. అందువల్ల ఆయా గ్రామ సచివాలయంలో పనిచేసే విఆర్వోలు ముందస్తుగా చట్టాలపై అవగాహన చేసుకొని జాగ్రత్తగా తమ విధులను నిర్వర్తించాలన్నారు. వీఆర్వోల విధి విధానాల గురించి జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, డిఆర్ఓ గాయత్రీ దేవి, హ్యాండ్ సెట్ సీఈవో హరి ప్రసాద్, కలెక్టరేట్ ఏవో విజయలక్ష్మి, తహసిల్దార్ లు విశ్వనాథ్, నాగరాజు, హరి కుమార్, డి టి శ్రీధర్, పెనుగొండ, కదిరి, కళ్యాణదుర్గం డివిజన్ నుండి 111 మంది పదోన్నతులు పొందిన విఆర్వోలు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు..