గ్రీన్‌ ఎనర్జీ రంగంలో మరిన్ని పెట్టుబడులు. మరో మూడు అవగాహనా ఒప్పందాలు.

 

దావోస్‌ (prajaamaravathi);


– గ్రీన్‌ ఎనర్జీ రంగంలో మరిన్ని పెట్టుబడులు. మరో మూడు అవగాహనా ఒప్పందాలు.



– ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు.

– మొత్తంగా 14వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీకోసం రూ. 65వేల కోట్ల పెట్టుబడి, 18వేల మందికి ఉద్యోగాలు

– మచిలీపట్నంలో గ్రీన్‌ ఎనర్జీ ఆధారంగా ఎస్‌ఈజెడ్‌ ఏర్పాటుపైనా ఎంఓయూ

– నిన్న రూ.60వేల కోట్ల పెట్టుబడితో 13,700  మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీకోసం అదానీతో అవగాహనా ఒప్పదం. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10వేలమందికిపైగా ఉద్యోగాలు.

– ఒక్ర గ్రీన్‌ ఎనర్జీ విభాగంలోనే దావోస్‌ వేదికగా రూ. 1.25 లక్షల కోట్ల అవగాహనా ఒప్పందాలు.


1.

– ఏపీలో కర్బన రహిత విద్యుత్‌ ఉత్పత్తికి గ్రీన్‌కో – ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం.

– 8వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తిపై అవగాహనా ఒప్పందం.

– ఇందులో వేయి మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు, 5వేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు, 2వేల మెగావాట్ల విండ్‌ ప్రాజెక్టు.

– దీనికోసం రూ.37వేల కోట్ల పెట్టుబడి, తద్వారా దాదాపు 10వేలమందికి ఉద్యోగాలు.


2. 

– మరో 6వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పదం కుదుర్చుకున్న అరబిందో రియాల్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌లిమిటెడ్‌.

– ఇందులో భాగంగా 2వేల మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో ప్రాజెక్టు, మరో 4వేల మెగావాట్ల సోలార్‌ మరియు విండ్‌ ప్రాజెక్టులు.

– ప్రస్తుతం కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో సదుపాయాలను వినియోగించుకుని ఈప్రాజెక్టులను చేపట్టనున్న అరిబిందో రియాల్టీ.

– దీనికోసం దాదాపు రూ.28వేల కోట్ల పెట్టుబడి, దాదాపు 8వేలమందికి ఉద్యోగాలు. 


3. 

– మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటుపై ఏంఓయూ. 

– రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఒప్పందం.

– గ్రీన్‌ ఎనర్జీతో సహాయంతో ఈ జోన్‌లో పారిశ్రామిక ఉత్పత్తి.

– ఈ జోన్‌లో ప్రపంచస్థాయి కంపెనీలకు అవసరమైన వసతుల కల్పన.


– నిన్న రూ.60వేల కోట్ల పెట్టుబడితో 13,700  మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీకోసం అదానీతో అవగాహనా ఒప్పదం. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10వేలమందికిపైగా ఉద్యోగాలు.

– ఒక్ర గ్రీన్‌ ఎనర్జీ విభాగంలోనే దావోస్‌ వేదికగా రూ. 1.25 లక్షల కోట్ల అవగాహనా ఒప్పందాలు.

Comments