ముదిగుబ్బ మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
*: ఉపాధి పనులను, ఇంటర్మీడియట్ పరీక్షలను, సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్*
ముదిగుబ్బ (శ్రీ సత్యసాయి జిల్లా), మే 13 (ప్రజా అమరావతి):
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ముదిగుబ్బ మండలంలో విస్తృతంగా పర్యటించారు. శుక్రవారం ఉదయం ముదిగుబ్బ మండల కేంద్రం పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను, ఇంటర్మీడియట్ పరీక్షలను, సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ముందుగా ముదిగుబ్బ రింగరోడ్ నుంచి ద్విచక్ర వాహనంలో బయల్దేరి తెల్ల కొండ నందు ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న కందకాల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఈరోజు ఎంత మంది కూలీలు ఉపాధి పనులకు వచ్చారు, ప్రతిరోజు ఎంత మంది కూలీలకు పనులకు వస్తున్నారు, ఇప్పటివరకు ఎన్ని రోజులు పని చేశారు, ఎంత కూలీ డబ్బులు వచ్చింది, తదితర వివరాలను కూలీలతో ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ మంది కూలీలు ఉపాధి పనులకు వచ్చేలా కూలీలకు అవగాహన కల్పించాలన్నారు. కూలీ డబ్బులు చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు 257 రూపాయల డబ్బులు వచ్చేలా పనిచేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం పనులను కూలీలు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కూలీల మస్టర్ లను తనిఖీ చేశారు.
వ్యవసాయ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలి జిల్లా కలెక్టర్
ముదిగుబ్బ నందు ఆర్ బి కె ని సందర్శించి రికార్డ్స్ ని పరిశీలించారు. ఈ పంట నమోదు, ఎరువులు విత్తనాలు పంపిణీ కౌలు రైతుల నమోదు కస్టమ్స్ హైరింగ్ సెంటర్ గురించి వివరాలు జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వై ఎస్ ఆర్ యాప్.D. KriSh యొక్క ఉపయోగాలు, వాటి పనితీరుని క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వి ఏ ఏ లు రైతులందరికీ సలహాలు, సూచనలు ఇవ్వాలని, ఫీల్డ్ విజిట్ చేసి రికార్డ్ లో తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపినారు. రైతు భరోసా కేంద్రం లో ఉచితంగా అందుతున్న సేవల సంబంధించి బోర్డులను , వివిధ సంక్షేమ పథకాల పై ఆరా తీశారు. అనంతరం
సచివాలయం ద్వారా నాణ్యమైన సేవలు అందించాలి.
ముదిగుబ్బ కేంద్రంలోని గ్రామ సచివాలయం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయం ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చాలని, లబ్ధిదారులకు అక్నాలెడ్జ్మెంట్ కార్డులను అందించాలని, తదనంతరం వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సచివాలయంలో రిజిస్టర్ లను, బయోమెట్రిక్ అటెండెన్స్ ను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వరప్రసాద్, తాసిల్దార్ కరుణాకర్ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్, జెడ్ పి టి సి తిరుమల బాయ్ సేవా నాయక్, ఈ ఓ పి ఆర్ డి నసీబ్, ఏ పీ ఓ రవి, ఏవో నరసింహులు సంబంధిత శాఖ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment