కేంద్ర ప్రభుత్వ అధికారులతో జరిగే సమావేశంలో రియింబర్స్‌ అంశాన్ని ప్రస్తావించాలని అధికారులకు సీఎం ఆదేశం.


అమరావతి (ప్రజా అమరావతి);


*–జలవనరులశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


*–గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని సమీక్షించిన సీఎం.* 

– పోలవరం దిగువ కాఫర్‌ డ్యాం పనులు జులై 31 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు.

 ఆ దిశగా పనులు సాగుతున్నాయన్న అధికారులు. 

ఇప్పటికే 68 శాతం పనులు పూర్తయ్యాయన్న అధికారులు. 

– దిగువ కాఫర్‌ డ్యాంలో కోతకు గురైన ప్రాంతాన్ని ఇసుకతో నింపేందుకు అన్నిరకాల ప్రయత్నాలు మొదలు పెట్టామన్న అధికారులు.

 దీనికోసం 76 శాతం జియో బ్యాగులతో ఇప్పటికే నింపామన్న అధికారులు. 

– దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ నిర్మాణ డిజైన్లపై ఇన్వెస్టిగేషన్‌ పూర్తయ్యిందని, ఈనెలాఖరు నాటికి డిజైన్లపై స్పష్టత వస్తుందన్న అధికారులు. 


– పోలవరం నిర్మాణానికి సంబంధించి ఇంకా రియింబర్స్‌ చేయాల్సిన డబ్బు రూ. 2,559.37 కోట్లు. 

– ఈ డబ్బు ఇంకా ఇవ్వాల్సి ఉందన్న అధికారులు.

– వీలైనంత త్వరగా డబ్బును తెప్పించుకునే ప్రయత్నాలు చేయాలన్న సీఎం. 

– పీపీఏ అనుమతి ఇచ్చిన తర్వాతనే ప్రతి పనీ జరుగుతుంది:

– పనులు వేగంగా పూర్తిచేయాలన్న దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తన డబ్బు ఖర్చుచేస్తోంది:

– చేసిన పనులకు సంబంధించి బిల్లులు వెంటనే రియింబర్స్‌ జరిగేలా చూడాలి:

– కేంద్ర ప్రభుత్వ అధికారులతో జరిగే సమావేశంలో రియింబర్స్‌ అంశాన్ని ప్రస్తావించాలని అధికారులకు  సీఎం ఆదేశం.నెల్లూరు, సంగం బ్యారేజీ పనుల పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు.

నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు సకాలంలో ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న అధికారులు. 


*అవుకు టన్నెల్‌ పనులపైనా సమీక్ష.*

– అవుకు టన్నెల్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఆగస్టు నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు.


*వెలిగొండ ప్రాజెక్టు పనుల ప్రగతిని వివరించిన అధికారులు.*

– 2014–19 మధ్య గత ప్రభుత్వ హయాంలో టన్నెల్‌ –1 కు సంబంధించి కేవలం 4.33 కిలోమీటర్లు మాత్రమే పనులు జరిగాయి.

అంటే రోజుకు కేవలం 2.14 మీటర్ల పనిమాత్రమే గత ప్రభుత్వ హయాంలో సాగింది.


– 2019 – 2022 వరకు కేవలం మూడేళ్ల కాలంలోనే మన ప్రభుత్వ హయాంలో జరిగిన పని 2.8 కిలోమీటర్లు.

అంటే రోజుకు 4.12 మీటర్ల మేరకు టన్నెల్‌ పనులు జరిగాయన్న అధికారులు.


– టన్నెల్‌ –2 కు సంబంధించి 2014–2019 మధ్యలో రోజుకు 1.31 మీటర్ల పని జరగ్గా...

మన ప్రభుత్వ హయాంలో 2019–22 మధ్య కాలంలో రోజుకు 2.46 మీటర్లు పని జరిగిందన్న అధికారులు.


– ప్రస్తుతం వెలిగొండలో నెలకు 500 మీటర్లపైన పనిచేస్తున్నామన్న అధికారులు.


– సెప్టెంబరులో టన్నెల్‌–1 ద్వారా నీటి విడుదల చేస్తామన్న అధికారులు.

– టన్నెల్‌–1 ద్వారా నీటిని పంపిస్తున్న సందర్భంలోనే టన్నెల్‌–2లోనూ కొనసాగనున్న పనులు. 

జూన్, 2023 నాటికి టన్నెల్‌ –2 పనులు పూర్తి.

– ఈలోగా పునరావాస కార్యక్రమాలను పూర్తిచేయాలని సీఎం ఆదేశం. *ఉత్తరాంధ్రా సాగునీటి ప్రాజెక్టులపైనా సమీక్ష.*

– వంశధార నిర్వాసితుల కోసం అదనపు ఎక్స్‌ గ్రేషియా పైన సీఎం సమీక్ష.

– దాదాపు రూ.226.71 కోట్ల రూపాయలను దీనికోసం ఖర్చుచేస్తున్న ప్రభుత్వం.

– నిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకు ఈ చెల్లింపులు చేస్తున్నామన్న సీఎం. 

– నిధులు మంజూరుచేస్తూ మార్చిలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయన్న అధికారులు.


*–గొట్టా బ్యారేజీ వద్ద లిఫ్ట్‌ పెట్టి.. దానిద్వారా హీరమండలం రిజర్వాయర్‌ నింపే ప్రతిపాదనకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌.*

– దీనిపై పూర్తిస్థాయి కార్యాచరణ సిద్ధంచేయాలని సీఎం ఆదేశం. 

– నేరడి బ్యారేజీ నిర్మాణం అంశంపైనా కూడా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం. 


– గజపతినగరం బ్రాంచ్‌  కెనాల్, తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టులకు సంబంధించి వెంటనే పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. 


*రాయలసీమ ప్రాజెక్టులపైనా సీఎం సమీక్ష.*

– తాగు, సాగునీటికి తీవ్ర కొరత ఉన్న కర్నూలు పశ్చిమ  ప్రాంతంలో ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం. 

–నీటి కొరత కారణంగా ఈ ప్రాంతాల నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని నివారించాలన్న సీఎం

–సాధ్యమైనంత వేగంగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న సీఎం.

–తద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో వలసలు నివారించడానికి ఈ ప్రాజెక్టులు చాలా ఉపయుక్తంగా ఉంటాయన్న సీఎం


– చిత్తూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు తాగు, సాగునీటిని అందించాలని సీఎం ఆదేశం.

 కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు కూడా త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం ఆదేశం. 


*మిగిలిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలన్న సీఎం.*

ఆయా ప్రాజెక్టుల పనుల ప్రగతిని సమీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్న సీఎం 


భైరవానితిప్ప ప్రాజెక్టు, మడకశిర బైపాస్‌ కెనాల్, జీఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌ –2 (కోడూరు వరకు), జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీం, ఉత్తరాంధ్ర  సుజల స్రవంతి, రాయలసీమ లిప్ట్‌ స్కీం, ఎర్రబాలి లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీం నుంచి యూసీఐఎల్‌ సప్లిమెంట్, రాజోలి, జలదిరాశి రిజర్వాయర్లు(కుందూ నది), రాజోలి బండ డైవర్షన్‌ స్కీం, వేదవతి ప్రాజెక్టు, మంత్రాలయం – 5 లిప్ట్‌ స్కీంలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్న సీఎం ఈ సమీక్షా సమావేశంలో జలవనరులశాఖమంత్రి అంబటి రాంబాబు, సీఎస్‌ సమీర్‌ శర్మ, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఆర్ధిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, జలవనరులశాఖ ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ సి నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments