ఆస్పత్రులలో ఎలాంటి చిన్న తప్పు జరిగినా ఉపేక్షించేది లేదు ..... జిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్

 మెరుగైన వైద్యసేవలు అందించాలి


   ఆస్పత్రులలో  ఎలాంటి చిన్న తప్పు జరిగినా    ఉపేక్షించేది లేదు


..... జిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్


 హిందూపురం, మే 10 (ప్రజా అమరావతి);

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి . బసంత కుమార్ సూచించారు. మంగళవారం

హిందూపురం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీచేశారు.

ఈ సందర్భంగా విధి నిర్వహణలో ని వైద్య అధికారులతో  రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.  అలాగే వైద్యులతో ప్రత్యేక  సమావేశం నిర్వహించారు ప్రతి రోజు ఎంతమంది  రోగులు ఓపి కి  వస్తుంటారు ? అడ్మిషన్లు ఎంతమంది ఉన్నారు , వైద్య సేవలు సక్రమంగా ఉన్నాయా, వివిధ రకాల వ్యాధుల కు సంబంధించిన వైద్య సిబ్బంది ఉన్నారా తదితర అంశాలపై కలెక్టర్ వైద్యులతో ఆరా తీశారు.  ఈసందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు విధిగా  విధులలో ఉండాలి. ఓపీ సమయములో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి. ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు సిబ్బంది మరింత బాధ్యతగా  పనిచేయాలని తెలిపారు. ఆస్పత్రులలో ఎలాంటి చిన్న తప్పు జరిగినా ఉపేక్షించేది లేదని  వైద్య సిబ్బందినిఆదేశించారు.   హాస్పిటల్  మందుల స్టోర్(ఫార్మసీ)  ను తనిఖీ చేసి మందుల స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తెస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వైద్యులకు  సూచించారు  జనరల్ వార్డ్ లలోవైద్య చికిత్స పొందుతున్న స్త్రీ, పురుష విభాగం  వార్డులను పరిశీలించారు. రోగుల వద్దకు వెళ్లి ఏ లాంటి జబ్బులకు గురయ్యారు, వైద్యసేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాలు రోగుల తో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

ప్రస్తుతం ఆసుపత్రి పరిస్థితులను పరిశీలించడానికి మాత్రమే వచ్చానని, రానున్న రోజుల్లో  జిల్లా లోని   ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శిస్తామని  తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల కొరత ఉన్నట్లు తెలిసిందని  ఈ ఆస్పత్రిలో   వివిధ పోస్టులను  భర్తీ చేయడానికి  చర్యలు చేపట్టడం  జరుగుతుందని తెలిపారు.  రోగులకు అవసరమైన  విధంగా ఈ 

ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల మందుల అందుబాటులో ఉన్నాయని

నూతన జిల్లాలో  హిందూపురం  ప్రధాన  ప్రభుత్వఆస్పత్రి కావడంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, మరోసారి ఆసుపత్రినీ సందర్శిస్తానని కలెక్టర్ తెలిపారు.

 ఈ కార్యక్రమంలో  పెనుగొండ సబ్ కలెక్టర్  నవీన్,ఆసుపత్రి సూపర్డెంట్  డాక్టర్ శివ కుమార్, ఆర్ యం ఒ   రుక్మిణమ్మ, ఇతర వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు


Comments