రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
స్పందన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలి
ఏ అర్జీ తిరిగి రాకుండా పరిష్కారం చూపాలి
ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్ కాకుండా శాశ్వతంగా పరిష్కరించాలి..
... కలెక్టర్ డా. కె. మాధవీలత
ప్రజల సమస్యల పరిష్కార వేదిక స్పందన లో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా అర్జీకి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, ఈ వారం ప్రజల నుంచి 145 అర్జీదారులు స్పందనలో ఫిర్యాదులను అందచేసారన్నారు. ఏ ఫిర్యాదు తిరిగి రీ ఓపెన్ కాకుండా పూర్తి స్థాయిలో శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. ఈరోజు స్పందనకార్యక్రమంలో సామాజిక పెన్షన్, భూమి సంబంధ అంశాలు, ఇండ్ల స్థలాలు, భూముల సరిహద్దు వివాదాలు, రేషన్ కార్డులు, ఇసుక, గృహ నిర్మాణం తదితర సమస్యల పరిష్కారం కొరకు అర్జీలను అందచేశారని తెలిపారు. స్పందన ఫిర్యాదులను ప్రభుత్వ మార్గదర్శకాలకి లోబడి పరిష్కారం చూపించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు లో మరింతగా ప్రగతి చూపాలి, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ సిద్దం చెయ్యాలని కలెక్టర్ ఆదేశించారు. విధి నిర్వాహణలో ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం విహించినా అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
దివ్యాంగుడైన ఆశ్ర శ్రీను కి కలెక్టర్ భరోసా: -
స్పందన కార్యక్రమం అర్జీలు స్వీకరణలో భాగంగా కడియం మండలం పొట్లంక గ్రామానికి చెందిన దివ్యాంగుడైన ఆశ్ర శ్రీను వద్దకు జిల్లా కలెక్టర్ మాధవీలత స్వయంగా వచ్చి ఫిర్యాదును స్వీకరించారు. ఇల్లు నిర్మించుకునేందుకు స్థలం అందించాలనే అతని అర్జీని పరిశీలించి , వెంటనే వీరికి స్థలాన్ని అందించాలని స్థానిక తాహాసిల్దార్ కు ఆదేశాలు జారీ చేశారు.
స్పందన అర్జిదారుల కోసం : -
వేసవి దృష్ట్యా కలెక్టరేట్ ప్రాంగణంలో టేంట్ ఏర్పాటు, శుద్ధమైన త్రాగునీరు, ఇతర సౌకర్యాలు
ప్రతి ఫిర్యాదు ఆన్ లైన్ లో నమోదు, గుర్తింపు రశీదు జారీ.
ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రత్యేక ఉచిత బస్సు సర్వీసు
అధికారులతో సమీక్షః-
స్పందన అనంతరం కలెక్టర్ డాక్టర్ మాధవి లత అధికారులతో సమీక్షిస్తూ శాఖల వారి కోర్టు కేసులు ఎక్కువగా వస్తున్నందున వెంటనే పరిష్కరించే విధంగా వీటిపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రస్థాయిలో హైకోర్టు నందు వెను వెంటనే కోర్టు కేసులు పరిష్కారానికి గాను ఏపీ ఆన్ లైన్ కేసెస్ లీగల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ అధికారులకు వివరించారు. శాఖల వారీ జిల్లా అధికారులు ఆయా జిల్లా కార్యాలయాలకు సంబంధించి ఈ- ఆఫీస్ లో నమోదు గల నోడల్ ఆఫీసర్ ను వెంటనే నియమించి, కలెక్టరేట్ కి నివేదిక సమర్పించాలని సూచించారు. వివిధ శాఖల అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే సమయంలో ప్రజా ప్రతినిధులకు తెలియచేసి ప్రోటోకాల్ పాటించాలన్నారు.
ఈ స్పందన కార్యక్రమం లో జేసీ సిహెచ్. శ్రీధర్, డీఆర్వో ఏ. సుబ్బారావు, జిల్లా అధికారులు డిఎంహెచ్ఓ డా. ఆర్.స్వర్ణలత, డిహెచ్ఓ బి. తారాచంద్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్. మాధవరావు, సీపీఓ శ్రీమతి పి.రాము, డిఎమ్ సివిల్ సప్లై కె.తులసి, డిఎస్ఓ పి.ప్రసాదరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.ఎస్టిజి సత్యగోవిందం, డీఈఓ అబ్రహం, డీఎస్ ఈడబ్ల్యూ & ఈఓ ఎమ్ ఎస్ శోభారాణి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment