రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు...
దేశానికి రోల్ మోడల్ గా రైతు భరోసా కేంద్రాలు : మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి
విజయవాడ (ప్రజా అమరావతి);
రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) వ్యవస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటూ.. దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలించిందని వ్యవసాయ, సహాకార, మార్కెంటింగ్ మరియు ఫుడ్ ప్రొసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆప్ ది యూనైడెడ్ నేషన్స్ - ఇండియన్ కౌన్సిల్ ఆప్ అగ్రికల్చర్ రీసెర్చ్(FAO-ICAR), ఆంధ్రప్రభుత్వం సంయుక్త ఆధర్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, రైతులను ఆదుకోవడానికి సుస్థిర వ్యవసాయ పద్దతులను అనుసరించడంపై రాష్ట్రస్థాయిలో మూడు రోజుల పాటు జరిగే శిక్షణా కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. విజయవాడ గేట్ వే హోటల్ లో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులకు మంత్రి కాకాణి జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.
అనంతరం మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రమని, 62% జనాభా వ్యవసాయం మరియు సంబంధిత కార్యకలాపాలలో నిమగ్నమై ప్రధాన వృత్తిగా ఉన్నారని తెలిపారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, రైతు సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని.. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నిక కాకముందే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి రైతులు, ప్రజల సమస్యలు తెలుసుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని.. ‘నవరత్నాలు’ అనే కార్యక్రమం కింద పేదలు, రైతులు, వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయబడుతున్నాయని తెలిపారు. ప్రత్యేకించి రైతుల కోసం YSR రైతుభరోసా- PM కిసాన్ పథకం కింద సంవత్సరానికి రూ. 13500/- ఆర్థిక సహాయం.. కౌలు రైతులకు కూడా అందజేస్తున్నామన్నారు. మత్స్యకారభరోసా, ఉచిత విద్యుత్ సరఫరా, ఉచిత పంట బీమా (రైతుల కోసం ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది), వడ్డీ లేని పంట రుణాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టాలకు ఇన్‌పుట్ సబ్సిడీ, సబ్సిడీ విత్తనం సరఫరా, పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించుట, రూ. 3000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో దేశానికే తలమానికంగా ఉన్న రైతు భరోసా కేంద్రాలు (RBKS)ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాసన పుత్రిక అని, నేడు వ్యవసాయ సేవల పంపిణీ, విస్తరణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,778 ఆర్బీకేలు పని చేస్తున్నాయని, విత్తనాల నుండి పంటల అమ్మకం వరకూ ఆర్బీకేలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల సరఫరా, నాణ్యత పరీక్షలు, పంట సలహాలు, రైతు క్షేత్ర పాఠశాలలు (పొలంబాడి), వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, రైతు సంక్షేమ పథకాలు, E-క్రాప్ బుకింగ్, వ్యవసాయ యంత్రాల సరఫరా కోసం కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాలు, పశుసంవర్ధక సేవలు (ఫీడ్ సరఫరా, టీకాలు వేయడం, అల్ సర్వీస్, వైద్య సేవలు), బ్యాంకింగ్ సేవలు వంటి వినూత్న సేవలు ఆర్బీకేల ద్వారా రైతులకు అందజేస్తున్నామన్నారు. నీతి అయోగ్, ఆర్బీఐ, నాబార్డు, ఐసీఏఆర్ వంటి అనేక జాతీయ స్థాయి అపెక్స్ సంస్థలు.. తమిళనాడు, కేరళ, తెలంగాణ వంటి ఇంతర రాష్ట్రాలు RBKల చొరవను మెచ్చుకున్నాయని తెలిపారు. RBK ప్రోగ్రామ్‌కు సాంకేతిక సహకారం కోసం ICAR, IARI, NSRTC, NIPHM, IVRI వంటి అనేక జాతీయ సంస్థలు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నాయన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం రైతులకు గొప్ప ప్రయోజనం చేకూరుతుందని, వ్యవసాయరంగం సాంకేతికతతో రైతులకు వారి ఆదాయ స్థాయిలను పెంపొందించడంలో సహాయపడుతుందని మంత్రి ఆకాంక్షించారు. పర్యావరణపరంగా సురక్షితమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి మంచి వ్యవసాయ పద్ధతులను అవలంబించడంలో రైతులకు సహాయపడతాయన్నారు. ఇందుకోసం ‘వైఎస్సార్ పొలంబడి’ కార్యక్రమం నిర్వహించడం ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు.
వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. రైతుల జీవనోపాధికి అనువుగా పాలసీలు రూపొందిస్తూ.. రైతులకు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమాలతో పాటు ‘వైఎస్సార్ పొలంబడి’ ద్వారా వివిధ పంటల్లో సాగు ఖర్చు 10 నుంచి 20 శాతం తగ్గిందని, అదే నిష్పత్తిలో పంట దిగుబడులు పెరిగి రైతుకు నికర ఆదాయం చేకూరిందని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ FAO ప్రతినిధి డాక్టర్ సి కొండారెడ్డి, అగ్రికల్చర్ కమిషనర్ హరి కిరణ్, హార్టీ కర్చర్ కమిషనర్ డా. ఎస్. శ్రీధర్, డాక్టర్ వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. జానకి రామ్, ICAR ప్రతినిధి షమ్మిరెడ్డి, శాస్త్రవేత్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment