గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం..

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);



** గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం..



** రైతు బజార్లలో, ముఖ్య కూడళ్ళలో.


..కలెక్టర్ కె.మాధవీలత



గిరిజన ప్రాంతంలో లభించే అటవీ ఉత్పత్తులను మార్కెటింగ్ సౌకర్యార్థం జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలో షాపులను ఏర్పాటు చేయుటకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవి లత పేర్కొన్నారు.


శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి తో  గిరిజన ఉత్పత్తులు మార్కెటింగ్ పై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో

గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తు లు తేనే, చింతపండు, త్రిఫల చూర్ణం, నన్నారి, అలోవిరా, జాస్మిన్, జ్యూట్ బాగ్స్, పసుపు, ఉసిరి, శీకాయ, కుంకుడు కాయలతో పాటు కాఫీపొడి  కల్తీ లేని స్వచ్ఛమైన ఉత్పత్తులు కావడంతో మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వీటికి ఎక్కువ డిమాండ్‌ ఉందన్నారు. ఐ టి డి ఎ ప్రాజెక్ట్ అధికారి సూచనల మేరకు నూతనంగా ఏర్పడిన తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన రాజమహేంద్రవరంలో గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను విక్రయించేందుకు జనసమూహము సంచరించే అనువైన రైతు బజారు, బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాల్లో షాపులను ఏర్పాటు చేయుటకు మార్కెటింగ్ అధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని  కలెక్టర్ అన్నారు.


 సమావేశంలో ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని కె ఎన్. జ్యోతి వారి సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు


Comments