అర్హులైన వారందరికీ ఉపాధి హామీ పథకం పనులు కల్పించాలి

 అర్హులైన వారందరికీ ఉపాధి హామీ పథకం పనులు కల్పించాలి


ఉపాధి పనులు సద్వినియోగం తో ప్రయోజనం


జిల్లా కలెక్టర్  బసంత కుమార్


లేపాక్షి,మే 10 (ప్రజా అమరావతి):

అసలైనప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్   బసంత కుమార్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం,  లేపాక్షి మండలం లోని, గంగోటి పల్లి, నాయిని పల్లి, కంచి సముద్రం పంచాయతీలోని   మామిడి మాకు పల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ 

ఉపాధి కూలీలతో పరిచయం చేసుకున్నారు.  రోజువారి కి ఎంత కూలి పడుతుంది. బిల్లులు సకాలంలో వస్తున్నాయా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? అంటూ కూలీలు   ఆరాతీశారు   ఆయా పంచాయితీలలోజరిగే ఉపాధి పనులు కూలీలతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ఉపాధి కూలీలకు రోజు వారికి కనీస వేతనం రూ.  257 కు తగ్గకుండా పని చూపించాలని మెట్ల ను ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు వచ్చి పనులు చేసుకుని10 గంటలకు ముగించుకుం 

టే మిగిలిన సమయంలో ఇంటి వద్ద పనులు చేసుకోవచ్చునని. లేకుంటే మరో పనికి వెళ్లే 

వేసులు బాటు ఉంటుందని ఉపాధికూలీలకు, మెట్లకు సూచించారు.ఉపాధి కూలీలు పనులు చేయాలని, జాబ్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబం 100  రోజులు పూర్తి పనులు చేయాలని, తెలిపారు. జిల్లాను రాష్ట్రంలోని మొదటి స్థానంలో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు

  ఉపాధి కూలీలు కలెక్టర్ గారికి తెలుపుతూ గత సంవత్సరంలో సమ్మర్ అలవెన్స్, గడ్డపారలు మరియు మంచినీటికి కూడా డబ్బులు ఇచ్చేవారని, ప్రస్తుతం ఇవ్వలేదని  వీటికి కూడా డబ్బులు ఇచ్చే టట్లు చూడాలని తెలిపినారు. కలెక్టర్ గారు తెలుపుతూ ప్రస్తుతము TCS    సాఫ్ట్వేర్ నుండి NIC సాఫ్ట్వేర్ నకు మారడం వలన మీరు తెలిపిన వెసలుబాటు లేదని, ఈ విషయమును ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని తెలపడం జరిగింది.  రాబోయే రెండు రోజుల్లో ఉపాధి కూలీలకు సంబంధించిన బిల్లులను  కూలీల ఖాతాల్లోకి  జమ  చేయిస్తామని  కూలీలకు తెలిపారు. 


  సచివాలయాల్లో మెరుగైన సేవలు అందించాలి

కలెక్టర్

చోలసముద్రం గ్రామ సచివాలయం ని  జిల్లా కలెక్టర్ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సకాలంలో ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. సచివాలయంలో వచ్చే  అర్జీలు  బి ఎన్ డి ఎస్ ఎల్ ఎ పరిధి లోకి వెళ్లకుండా పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగుల ను ఆదేశించారు. పలు రికార్డులను, హాజరు పట్టికను, వివిధ సంక్షేమ పథకాల,  పరిశీలించారు.

అనంతరం నూతన గ్రామ సచివాలయం  భవనం నిర్మాణం పనులన  పరిశీలించారు. త్వరితగతిన  నాణ్యమైన భవననిర్మాణం పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను మరియు కాంట్రాక్టర్ లను ఆదేశించారు.

కార్యక్రమంలో ఎంపీడీవో నరసింహ నాయుడు, ఏ పీ డీ శివానంద నాయక్, ఎస్ సి పి ఆర్ గోపాల్ రెడ్డి, మోహన్, తదితరులు పాల్గొన్నారు,



Comments