పరిశ్రమల స్థాపనకు ఇదే మంచి తరుణం
జగనన్న బడుగు వికాసం పధకాన్ని వినియోగించుకోవాలి
ఫుడ్ ప్రాసెసింగ్, రైస్ మిల్లులు ఏర్పాటుకు ప్రాధాన్యం
జిల్లా కలెక్టర్ సూర్య కుమారి
విజయనగరం, మే 28 (ప్రజా అమరావతి):: పరిశ్రమల స్థాపన ఇప్పుడు
సులభతరం అయ్యిందని, లాజిస్టిక్స్ అన్నీ వేగంగా జరుగుతున్నాయని, ఆసక్తి కలవారు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే అన్ని విధాలా సహకారం అందించడం జరిగుతుందని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా స్థాయి పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో రెండు జాతీయ రహదారుల త్వరలో పూర్తి కానున్నాయని, వీటి వలన జిల్లా నుండి విశాఖపట్నం పోర్ట్ కు, ఎయిర్పోర్ట్ కు దూరం తగ్గుతుందని అన్నారు. అంతే కాకుండా రైల్వే లైన్ కూడా డబల్ అవుతోందని, ఈ నేపథ్యంలో జిల్లాలోని భూముల విలువ పెరిగే అవకాశం ఉందని, పరిశ్రమలు పెట్టడానికి ఇదే మంచి సమయమని తెలిపారు. పరిశ్రమల కు అవసరమగు భూమి ఉందని, స్వంత భూముల్లో ఏర్పాటు చేసుకునే వారికీ ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. నూతన విధానం పుష్ ప్రకారంగా మౌలిక వసతుల ఏర్పాటు, ట్రాన్స్పోర్ట్, వేర్ హౌసింగ్, కోల్డ్ స్టోరేజ్ చైన్, కంటైనర్ డిపో, ఫ్రీ ట్రేడ్ హౌసింగ్ జోన్స్ తదితర వసతులను అభివృద్ధి చేయడం జరిగుతుందన్నారు.
జగనన్న బడుగు వికాసం పధకం క్రింద ఎస్.సి., ఎస్.టి కు చెందిన పారిశ్రామిక వేత్తలకు ముద్ర, పి.ఎం.ఈ.జి.పి, స్టాండప్ ఇండియా రుణాలు మంజూరు చేయడం జరుగితుందని తెలిపారు. స్టాండప్ ఇండియా నిబంధనల మేరకు ఎస్.సి., ఎస్.టి మహిళలకు పరిశ్రమల కోసం ప్రతి బాంక్ లో రుణాలు ఇవ్వవలసి ఉందని స్పష్టం చేశారు. మండల స్థాయి, సచివాలయం స్థాయి లో విస్తృత ప్రచారం గావించి గ్రామాల్లో ఎం.ఎస్.ఎం.ఈ ల ఏర్పాటుకు కృషి చేయాలని కలెక్టర్ ఎల్.డి.ఎం కు ఆదేశించారు.
జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్, రైస్ మిల్లులు ఏర్పాటుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అదే విధంగా హాస్పిటాలిటీ రంగం లో కూడా డిమాండ్ ఎక్కువగా ఉందని, ఈ మూడు రంగాలకు అత్యంత ప్రాధాన్యత నివ్వడం జరుగుతుందన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో, యూనివర్సిటీలలో ఆయా యాజమాన్యాల సహకారం తో యువతకు అవగాహన కలిగించాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ పాపా రావు, ఏపిఐఐసి జాయింట్ డైరెక్టర్ యతి రాజు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.
addComments
Post a Comment