జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేద్దాం ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేద్దాంరాజమహేంద్రవరము, (ప్రజా అమరావతి);


జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేద్దాం ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేద్దాం


జూన్ 1 నాటికి ఖరీఫ్ సాగుకు రైతాంగం సిద్ధంగా ఉండాలి


               ..జిల్లా ఇన్చార్జి మంత్రి వేణు గోపాల కృష్ణ 

             ..హోం మంత్రి తానేటి వనిత


జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని  డిఆర్సి ఛైర్మన్, జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినీ ఆటోగ్రఫీ శాఖ మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ పేర్కొన్నారు.


 బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో  తూర్పు గోదావరి జిల్లా తొలి  జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.. ఈ సందర్భంగా మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ,  సమన్వయంతో ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజా అవసరాలకి ప్రాధాన్యత   ఇచ్చినట్లయితే ప్రజలు సంతృప్తి చెందుతారన్నారు .  ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆలోచించినట్టు ప్రజల అవసరాలకు పరిష్కారం చూపాలన్నారు.    సమయానికి విలువ,  అవసరాన్ని గుర్తించి  వివిధ  స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారి అవసరాలు తీరక ఇబ్బందులు అది తెలిసినటు వంటి మనసున్న వ్యక్తి  ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అందరికీ తెలుసునన్నారు.  తూర్పుగోదావరి జిల్లా గోదావరి, ఏజెన్సీ, మెట్ట తదితర అన్ని ప్రాంతాల సమతుల్యత కలిగిన  లక్షణాలను  తూర్పుగోదావరి జిల్లా లో ఉన్నాయన్నారు. గోదావరి జిల్లాలోని 347 ప్రాచీన సాంప్రదాయ కళలకు రాజమహేంద్రవరం చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న విషయం విదితమన్నారు.   ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ స్థాయిలో రాష్ట్ర మంత్రివర్గంలో బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ మంత్రిగా అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ మంత్రిగా,  జిల్లా ఇంచార్జ్ మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూన్నానన్నారు. ప్రజాసేవ కు ప్రధాన మార్గం రాజకీయం అయితే రాజకీయాల్లో ఎన్నిక కాబడిన అటువంటి వ్యక్తికి లభించే అవకాశాలు పదవులు అన్నారు.  ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని  ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను  ప్రాధాన్యతా క్రమంలో అమలు చేసెందుకు నూతన జిల్లాల వ్యవస్థ ఏర్పాటు చేశారన్నారు.


పార్లమెంట్ సభ్యులు శాసన మండలి, శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు  వీరందరికి నిత్యం వారికి ఎదురైన సమస్యలు,  ప్రజా సమస్యల్ని పరిష్కారం కోసం వారికి  ఉన్నటువంటి అనుభవాన్ని సమావేశంలో చర్చించి పరిష్కారం చూపడం జరగాలన్నారు. జిల్లా స్థాయిలో  ప్రతి అంశంలోనూ పరిష్కారం కోసం పనిచేస్తామని,  ఇక్కడ పరిష్కారం సాధ్యం కాకపోతే  ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళడానికి ఈ కీలక సమావేశంలో నిర్ణయాలు దోహదం చేస్తాయని మంత్రి పేర్కొన్నారు.


ప్రతి జూన్, డిసెంబర్ నెలల్లో ఇంకా అర్హులైన లబ్ధిదారులకు ఉంటే సామాజిక తనిఖీ చేసి మంజూరు చెయ్యడం ముఖ్యమంత్రి దూరదృష్టికి నిదర్శనం అన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం తో పాటు మౌలిక సదుపాయాలు ప్రాధాన్యత ఇవ్వాలన్నదే మన ప్రభుత్వ విధానం అన్నారు. మంత్రి మాట్లాడుతూ  ప్రజలు సంతృప్తి పరచడంలక్ష్యంగా పనుల్లో పురోగతి చూపించాల్సి ఉంటుందని తెలిపారు. నరేగా పనులు ప్రారంభించి  12 సంత్సరకాలం అయిందన్నారు. ఉపాధి హామీ పనులతో పాటు, గ్రామాల అభివృద్ది సాధ్యం అవుతుందని తెలిపారు.


నాడు నేడు ఫేజ్ .2 పై క్షేత్ర స్థాయిలో ఎంపిక చేయ్యాని స్కూల్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అటువంటి ప్రతిపాదనలు ఉంటే వాటికి ప్రాధన్యత ఇవ్వాలని మంత్రి వేణు గోపాల కృష్ణ పేర్కొన్నారు.మీ అందరి సహకారంతో జిల్లాను అగ్రస్థానం లో నిలిపెందుకు సమన్వయంతో పని చెయ్యడం జరుగుతుందన్నారు.  సమస్యపై చర్చించి  స్పష్టంగా క్లుప్తంగా పరిష్కార మార్గం తో పాటు సమస్య పరిష్కారం కూడా మీకు తెలిసిన సమస్యల ప్రస్తావన చేసేటప్పుడు పరిష్కారం మీకు తెలపాల్సి ఉంటుందన్నారు.  జిల్లా ఇంఛార్జి మంత్రి గా భాధ్యతల్ని ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.


రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, ఇండ్ల స్థలాలు కోసం ప్రజల నుంచి వచ్చిన డిమాండ్, ఇప్పటి వరకు ఇచ్చిన వివరాలు పై ప్రశ్నించారు. ఇంటి నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులకు చెల్లింపుల విషయంపై ప్రసించగ.  15/20 రోజుల్లో చెల్లింపులు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. ఇసుక సరఫరా విషయంలో ఇబ్బందులు పై అడుగగా ఎటువంటి ఇబ్బందులూ లేవని అధికారులు తెలిపారు.  రైతు కు ఉన్న సాగు భూమి  మొత్తాన్ని ఆధార్ లింక్ చెయ్యక పోవడంతో చిన్న సన్నకారు రైతులు నష్ట పోతున్నారని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో ఈ క్రాప్ బుకింగ్ లో లోపాలను సరిచేయ్యాలని సమావేశం దృష్టకి తీసుకుని వచ్చారు.


ఇంటి నిర్మాణాలు చేపట్టడంలో ఆసక్తి చూపుతున్న లబ్ధిదారులకు ఐరన్ సరఫరా చేయాలని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత సూచించారు. కొన్ని ప్రాంతాల్లో భారీ గా నిలవలు ఉన్నాయని, వాటినీ ఇంటి నిర్మాణం జరుగుతున్న లే అవుట్ లలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి గారి నిర్ణయం తో పరిపాలన సౌలభ్యం సాధ్యం అయిందన్నారు. ఏ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టే సందర్భం లో ప్రజా ప్రతినిధులతో కలిసి పని చేయడం ముఖ్యం అని తెలిపారు. సమన్వయం లోపించకుండా చూసుకోవాలని ఉందన్నారు.  నరెగా పనుల్లో భాగంగా ఉపాధి హామీ చట్టం ప్రాధాన్యత కలిగినదని , ఏ నియోజకవర్గం పరిధిలో అయినా పనిదినాలు కల్పన లో ఇబ్బందులు ఏర్పడితే స్థానిక  ప్రజా ప్రతినిధులతో కలిసి వెళ్ళాలని స్పష్టం చేశారు. లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ లను అనుసంధానం చేసుకుంటూ,  సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేలా  ప్రణాళిక రూపొందించుకోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు.

ప్రతి నియోజకవర్గం లో ఒక మోడల్ కాలనీ నిర్మాణం చేపట్టి, వాటి అనుభవంతో మరిన్ని నిర్మాణాలు పూర్తి చెయ్యగల మన్నరు. అగ్రి సలహా మండలి ని ఏర్పాటు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత తెలిపారు. ఈ మండలికి బురుగుపల్లి సుబ్బారావు ని ఛైర్మన్ గా నియమించామన్నారు.  వీరితో పాటుమరో  10 సభ్యులను కూడా నియమించనున్నారు.  మండల స్థాయిలో కమిటీ లు ఏర్పాటు చేసి , ప్రతి రెండు రోజుల కి ఒక సారి రైతులతో సమావేశం నిర్వహిస్తామని ఆమె తెలిపారు. సంప్రదాయ సాగు మరిచి పోతున్న ఈ సమయంలో ముందస్తు సాగు విధానం అభినందిచవలసినదని ఆమె పేర్కొన్నారు.


రాజమండ్రి ఎంపి మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ, కొత్త జిల్లాలు ఏర్పాటు నేపథ్యంలో డిఅర్సి లో ఎంపిల కి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హౌసింగ్ కార్యక్రమంలో భాగంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, రహదారులు, త్రాగునీరు, విద్యుత్, పార్కులు,  లే అవుట్ వద్దకు బస్సు సౌకర్యం కల్పించాలని సూచించారు. యుద్ద ప్రాతిపదికపై పనులు పూర్తిచేసి, ప్రజల్లో భరోసాఇవ్వాలనికోరారు. అధికారులు సమాధానం చెపుతూ, ఇప్పటికే 47 లే అవుట్ లలో సర్వే చేపట్టామని, పెద్ద లే అవుట్ లలో విద్యుత్ పనులు ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామన్నారు. టిడ్కో ఇళ్ల ను త్వరలోనే లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ఏం ఎల్ ఎ జక్కంపూడి రాజా మాట్లాడుతూ తోర్రిగడ్డ అభివృద్ధి పనులు జరుగుతున్న దృష్ట్యా శాశ్వత పనులు చేపట్టడం రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు.  లైనింగ్ పనులు సివిల్ పనులు పూర్తి చెయ్యాలని చగల్నాడు, పుష్కర పనులు జాప్యం వలన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వేగవంతం చేయాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ , అధికారులతో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు.  జిల్లాలో పలు తహశీల్దార్లు భూ సంబంధ విషయాల్లో కోర్టు కేసులు వలన ఇబ్బందులు పడుతున్నారని, వాటి సత్వర పరిష్కారం కోసం లైజనింగ్ అధికారి ని నియమించాలని పేర్కొన్నారు.  మండల వారీగా పనులు గుర్తించి కరపత్రాలు ద్వారా ప్రజలకు తెలియ చేయాలన్నారు.అనపర్తి శాసన సభ్యులు సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కొన్ని నియోజక వర్గాలలో  కాలువ పూడిక పనులు పూర్తి చేయాల్సి ఉన్నా, ఇంకా ప్రతిపాదనలకు అనుమతులు జాప్యం అవుతున్నాయని తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ గౌరవ శాసన సభ్యులు పంపే ప్రతిపాదన లతో నివేదిక పంపాలని తక్షణం చర్యలకు  అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


తలారి వెంకట్రావు మాట్లాడుతూ, కొన్ని పంచాయతీల్లో ఒక్క పట్టాకూడా రాని గ్రామాలు ఉన్నాయన్నారు. రెండో ఫేజ్ లో ఇళ్ళ ను మంజూరు చేయాలని కోరారు. గోపాలపురం 2 విడతలో ఇళ్ల నిర్మాణాలు చేసేందుకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా ఎర్ర కాలవ లో గల  ఇసుక మట్టిని ఇళ్ల స్థలాల పూడికకు అనుమతి కోరారు.


ఏమెల్సి షేక్ షాబ్జి మాట్లాడుతూ, ఇంటి నిర్మాణానికి అధిక మొత్తం ఖర్చు చెయ్యడం అవుతోందని, అందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేయాలని సూచించారు.


ఏమ్ఎల్ఎ జీ. శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ, ఇంటి నిర్మాణాలు వేగవంతం అవుతున్నాయని,  రాబోయే రోజుల్లో అవసరాలకు ఇసుకకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టి లో ఉంచుకుని ముందుగానే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇసుక నిల్వలు ఉంచాలన్నారు. వర్షాలు వల్ల ఇబ్బందులు కలుగకుండా ముందస్తు గా  ఐరన్, సిమెంట్ తదితర మెటీరియల్ సిద్దం చేసుకోవలసి ఉందన్నారు. అర్బన్ ప్రాంతాల్లో , లే అవుట్ ప్రాంతాల్లో రహదారుల ఏర్పాటు పై సూచనలు చేశారు. కలెక్టర్ స్పందించి క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


ఎమ్ఎ.ల్.సి   చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ , ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు ఇచ్చిన మొత్తం సరిపోవడం లేదని పేర్కొనగా ఛైర్మన్ స్పందిస్తూ రు.50 వేలు ఆర్థిక చేయూత, అదనంగా 50 బస్తాలు సిమెంట్ ఇచ్చామని సభకు తెలిపారు.


నూతనంగా తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలోని  3 నియోజకవర్గాలు,  తూర్పు గోదావరి జిల్లాలోని 4 నియోజకవర్గాలతో ఏర్పడిందని, గ్రామస్థాయి నుంచి సెక్రటేరియట్ వ్యవస్థ, మండల , జిల్లా పరిషత్ వ్యవస్థలతో పాటుగా తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు మనం జిల్లా రివ్యూ కమిటీ మీటింగ్ చేసుకుంటున్నామన్నారు.


సమావేశంలో  తొలుత ఛైర్మన్ హౌసింగ్ పై  సమీక్ష చేశారు. తదుపరి  పేదలందరికీ ఇళ్లు, టిడ్కో పైన, వ్యవసాయం  రైతు భరోసా అమలు,  ఖరీఫ్ ప్రణాళిక,  కస్టమ్ హైరింగ్ సెంటర్ పైన, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం లో భాగంగా లేబర్ బడ్జెట్ పైన గ్రామ సచివాలయ ఆర్బికే, హెల్త్ క్లినిక్, తదితర భవనాలు నిర్మాణాల పై సమీక్ష చేశారు. విద్యా సమీక్షలో రెండో విడత నాడు నేడు పనులు పై, ఆరోగ్యశాఖ సమీక్ష లో నాడు నేడు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు పై, పౌరసరఫరాలు శాఖ సమీక్షలు ధాన్యం సేకరణపై, హార్టికల్చర్, సెరికల్చర్, మత్స్య శాఖ లపై సమీక్ష,  గ్రామీణ నీటి సరఫరా , ఇరిగేషన్,  గ్రామ వార్డు సచివాలయాలు, వివిధ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.


ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్, తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్  వేణు గోపాలరావు ,పశ్చిమగోదావరి జిల్లా  పరిషత్ చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ కౌరు శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ రామ్, శాసనమండలి సభ్యులు రామచంద్రుడు చిక్కాల రామచంద్రరావు, పిల్ల వెంకటేశ్వరరావు, షేక్ షాబ్జి,  అనంత ఉదయ భాస్కర్, శాసనసభ్యులు తలారి వెంకట్రావు, జి శ్రీనివాస్ నాయుడు, జక్కంపూడి రాజా, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె మాధవీలత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవ్ రావు, జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, జిల్లా హార్టికల్చర్ అధికారి వి రాధాకృష్ణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎస్ టి జి గోవిందం, జిల్లా హౌసింగ్ అధికారి తారాచంద్, పౌరసరఫరాల అధికారి టి.తులసి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని ఎమ్మెస్ శోభారాణి, రాజమండ్రి, కొవ్వూరు ఆర్ డి వో లు చైతన్య వర్షిని, ఎస్ మల్లిబాబు, సివిల్ సప్లై డిఎస్ఓ ప్రసాద్ రావు,  విద్యాశాఖ అధికారి అబ్రహం ఇరిగేషన్ అధికారి  రాంబాబు   డి ఎం హెచ్ ఓ డాక్టర్ స్వర్ణలత,  డి సి హెచ్ ఓ డాక్టర్  సనత్ కుమారి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image