తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పూర్తిస్ధాయిలో అప్రమత్తంగా ఉండాలి.

 

అమరావతి (ప్రజా అమరావతి);


*అసని తుపాను ప్రభావిత జిల్లాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులకు సీఎం దిశా నిర్దేశం.* 


*తుపాను నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలి.*


*బాధితుల పట్ల మానవతాదృక్పధంతో వ్యవహరించాలి.*


*సహాయక కేంద్రాల కోసం ఇప్పటికే నిధులు కేటాయించాం.*


*పునరావాస కేంద్రాల్లో ఒక్కొక్క వ్యక్తికి రూ.1000, కుటుంబానికి రూ.2వేలు సాయం : సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*



*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..:*

తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పూర్తిస్ధాయిలో అప్రమత్తంగా ఉండాలి. 


ప్రధానంగా బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. 

వీరికి ఇప్పటికే అవసరమైన నిధులు విడుదల చేశాం.

అవసరమైన మేర ఖర్చు చేసుకోవచ్చు.

కోస్తా తీరప్రాంతాల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి.

నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుంది. ఈ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం.

ముఖ్యంగా తీరం వెంబడి లోతట్టు ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండటంతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవాలి. 


కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలి. వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలి. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. 


454 చోట్ల సహాయ, పునరావాస కేంద్రాలను గుర్తించామని తెలిపిన అధికారులు.

అవసరమైన చోట్ల మరిన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న సీఎం.


డీజిల్‌ జనరేటర్లు, జేసీబీల వంటి సహాయ పునరావాసానికి ఉపయోగపడే వస్తువులను సిద్దం చేసుకోవాలన్న సీఎం.

దీంతో పాటు బియ్యం, పప్పులు, వంటనూనెలు వంటి ఇతర నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో ఉంచుకోవాలన్న సీఎం.  

మరోవైపు వివిధ ప్రభుత్వ విభాగాల వారీగా సహాయ చర్యల కోసం  సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.

వివిధ ప్రభుత్వ శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలన్న సీఎం.

ఎట్టి పరిస్థితుల్లోనూ మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

గాలులు వేగం గంటకు 30 నుంచి 80 కిలోమీటర్లు వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతాయన్న సూచనలు కూడా ఉన్నాయి. 

కలెక్టరు అందరూ జాగ్రత్తగా ఉండాలి, అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న సీఎం 

త్వరతగతిన సహాయపునరావాస చర్యలు చేపట్టాలి.

పునారావాస కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలి.  ప్రతి ఒక్కరు పునరావాస కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలి.


లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ  ఖాలీ చేయించి.. సహాయ కేంద్రాలకు తరలించాలి. వారికి భోజనం,వసతితో సహా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలి. 

బాధితుల పట్ల మానవతాదృక్పధంతో వ్యవహరించాలన్న సీఎం.

 బాధితులు పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు.... ఒక్కొక్కరికి రూ.1000,  కుటుంబానికి కనీసం రూ.2వేలు చొప్పున వారి చేతిలో పెట్టాలన్న ముఖ్యమంత్రి. 

వరద ముంపు నుంచి బయటపడ్డ తర్వాత బాధితులు వారి ఇళ్లు బాగుచేసుకోవడంతో పాటు వారి అవసరాల కోసం ఈ నగదు ఉపయోగపడుతుందన్న సీఎం.

ప్రధానంగా తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న 7 జిల్లాల్లో ఈ ఏర్పాట్లు చేయాలి ... కలెక్టర్లకు సీఎం నిర్దేశం. 

కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, తూర్పు పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ ప్రాంతాలకు మధ్యాహ్నానికి తుపాను తాకే అవకాశం ఉంది. సాయంత్రానికి విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు, సాయంత్రానికి అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలపైనా ప్రభావం చూపిస్తుంది. 

అధికారులందరూ జాగ్రత్తగా ఉండాలన్న సీఎం. 


బాధితులకు హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు పక్కాగా ఉండాలన్న సీఎం.

హెల్ప్‌ లైన్‌పై ప్రచారం చేయాలన్న సీఎం.

ఉప్పాడ రోడ్డుకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలన్న సీఎం

దీనికి సంబంధించి చెన్నై ఐఐటీ నిపుణులతో మాట్లాడి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తున్నామన్న అధికారులు.



కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, హోం, డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ శాఖమంత్రి తానేటి వనిత, ఆర్‌అండ్‌ బి మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా),  సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కె వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాదు, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ డైరెక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ ఇతర ఉన్నతాధికారులు.

Comments