ప్రతి శనివారం నియోజకవర్గ స్థాయిలో స్పందన - కలెక్టర్ బసంత కుమార్

 ప్రతి  శనివారం నియోజకవర్గ స్థాయిలో స్పందన

- కలెక్టర్  బసంత కుమార్



పుట్టపర్తి, మే 23 (ప్రజా అమరావతి);


పాలన వికేంద్రీకరణ లో భాగంగా ఏర్పాటైన నూతన జిల్లాల యంత్రాంగం ప్రజలతో మమేకమైయ్యే దిశలో  ప్రతి శనివారం నియోజకవర్గ స్థాయి లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్  బసంత కుమార్  పేర్కొన్నారు. సోమవారం   పుట్టపర్తిలోని కలెక్టరేట్ నుంచి వన్టైమ్ సెటిల్మెంట్, నవరత్నాలు-  పేదలందరికీ ఇల్లు, స్పందన గ్రీవెన్స్,  ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన వివిధ భవన నిర్మాణాలు, ఉపాధి హామీ, జగనన్న స్వచ్ఛ సంకల్పం, జల్ జీవన్ మిషన్, రెవెన్యూ తదితర అంశాలపై పెనుగొండ సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్ లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, మండలస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కింద చేపట్టిన ఎస్ డబ్ల్యూ పిసి షెడ్లు నిర్మాణం వేగంగా చేపట్టాలన్నారు. నిర్మాణంలో ఉన్న ఆయా షెడ్లను వెంటనే పూర్తి చేయాలని, పూర్తయిన ఆయా షెడ్లలో వర్మి బెడ్ ను ఏర్పాటు చేయాలని, వర్మీ కంపోస్ట్ తయారీ మొదలు పెట్టాలన్నారు. ప్రతి మండలంలో రెండు గ్రామాలను ఎంపిక చేసి ఆయా పంచాయతీలలో end-to-end యాక్టివిటీ కింద పనులు పూర్తిచేసి జే ఎస్ ఎస్ యాప్ తడి చెత్త పొడి చెత్త  వేరు చేసి వాటిని మంచి ధరకు  అమ్మి వచ్చిన నగదును ప్రత్యేక యాప్ నమోదు చేయవలసిందిగా ఎంపీడీవో లను ఆదేశించారు ప్రతి ఎంపిడిఓ, ఈవోపీఆర్డీ కచ్చితంగా రోజుకి ఒక గంట చెత్త సంపద కేంద్రం లోని పనితీరును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.  చెత్త సంపదతయారీ కేంద్రం వద్ద  పరిశుభ్రంగా ఉండాలని.     చెత్త సంపద తయారీకేంద్రాల వద్ద  శ్రీ సత్య సాయి జిల్లా  నామకరణ  తో బోర్డులు ఉండాలని ఎంపిడివో ఆదేశించారు.ప్రస్తుతం వర్షాకాలం లో  కేంద్రాల వద్ద చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కొరకు  ఈనెల 28వ తేదీన  ధర్మవరం డివిజన్లో శనివారం రోజున స్పందన కార్యక్రమం  నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. మరల శనివారం, పెనుగొండ, మ మరల శనివారం కదిరి, మరల  శనివారం పుట్టపర్తి డివిజన్ కేంద్రాలలో  స్పందన కార్యక్రమం  నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆయా డివిజన్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.  హౌసింగ్ లేఔట్లలో ఇళ్ల నిర్మాణం ముమ్మరం చేయాలని, ఇందులో ఇంకా మొదలు కాని మరియు బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్న నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అలాగే బేస్మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలన్నారు. రోజువారీగా లక్ష్యాలను చేరుకోవాలని, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎక్స్పెండిచర్ ఖర్చు పూర్తయ్యేలా చూడాలన్నారు.పనులు పూర్తిచేసిన వాటికి బిల్లులు వెంటనే పంపాలన్నారు.స్పందన గ్రీవెన్స్ కి సంబంధించి గడువు తీరిన సమస్యలు ఒక్కటి కూడా పెండింగ్ ఉంచడానికి వీలులేదని, సున్నా చేయాలన్నారు. స్పందన గ్రీవెన్స్ అర్జీలకు సకాలంలో నాణ్యతగా అర్జీదారుడుని సంప్రదించి పరిష్కారం చూపించాలన్నారు. 

ఎపిఓఎల్-సిఎంఎస్ ( ఆంధ్ర ప్రదేశ్ ఆన్లైన్ లీగల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్) పోర్టల్ లో అన్ని శాఖలు ఇంకా లాగిన్ అవ్వలేదని, వెంటనే అన్ని శాఖలు ఖచ్చితంగా లాగిన్ కావాలన్నారు. కోర్టు కేసులు, కంటెంప్ట్ కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఎపిఓఎల్-సిఎంఎస్ పోర్టల్ లో లాగిన్ కావడం ద్వారా కోర్టులో ఎవరైనా కేసు నమోదు చేస్తే వెబ్సైట్లో నమోదు చేసిన వెంటనే కేసు వివరాలు మనకి తెలుస్తాయన్నారు. పోర్టల్ వెబ్సైట్లో కేసు డేటా ఎంట్రీ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే వివరాలు అధికారులు చూసుకునే వీలు ఉంటుందని, ఈ పోర్టల్  కోర్ట్ కేసుల గురించి తెలుసుకునేందుకు ఎంతో ముఖ్యమన్నారు. ఈ పోర్టల్ నిత్యం ఉపయోగించాలని, ఈ పోర్టల్ లో లాగిన్ కోసం ఆరు రకాల వివరాలు అందించాలన్నారు. అందులో ఆయా శాఖలకు సంబంధించి నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ (హెచ్ఓడి), డిసిగ్నేషన్, ఎంప్లాయ్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ లాంటి వివరాలు అందించాలని, ఆయా శాఖలు వివరాల అందజేత విషయమై పోర్టల్ ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. ఆయా శాఖలు వివరాలను అందిస్తే 24 గంటల్లోగా ఎపిఓఎల్-సిఎంఎస్ పోర్టల్ లో లాగిన్ పూర్తి చేయడం చేస్తామన్నారు. దీనిద్వారా హైకోర్టు కేసుల్లో మనం ఏం చేయాలో త్వరితగతిన తెలుస్తుందని, ప్రతి శాఖ అధికారులు వివరాలు అందజేయాలని ఆదేశించారు.*


*ఇక నుంచి అన్ని శాఖల ఫైల్స్ ఈఆఫీస్ లో మాత్రమే పంపించాలి :*


*ఇక నుంచి అన్ని శాఖలకు సంబంధించి ఫైల్స్ ఈఆఫీస్ లో మాత్రమే పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తమ వద్దకు ఎలాంటి ఫిజికల్ ఫైల్స్ తీసుకు రాకూడదన్నారు. ఇప్పటికీ కొన్ని శాఖలు మ్యానువల్ గా ఫైల్స్ సర్కులేట్ చేస్తున్నాయని, ఇకపై అలా చేయరాదన్నారు. ఈఆఫీస్ పద్ధతిలో మాత్రమే ఫైల్స్ పంపించాలని, ఇందుకు సంబంధించి ఏమైనా కార్యాలయ పేర్లు, అధికారుల వివరాలలో మార్పులు, చేర్పులు ఉంటే డిఐఓ ద్వారా వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డిజిటల్ కీ గడువు పూర్తి అయిన వారు వెంటనే ఆ డిజిటల్ కీలను రెన్యూవల్ చేయించడం లాంటివి డిఐఓ ద్వారా చేయించాలని సూచించారు. ఈఆఫీస్ పద్ధతి పట్ల ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు..

జగన్  తోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలని అందుకు  ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు  డి ఆర్ డి ఎ సిబ్బంది, మెప్మా   సిబ్బంది  గ్రామ వార్డు  సచివాలయ సంక్షేమ అధికారులు చురుకైన పాత్ర వహించాలని పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో  డిఆర్ఓ గంగాధర్ గౌడ్,  ఆర్డిఓ భాగ్యరేఖ, మీసేవ తాసిల్దార్ అనుపమ,  డిఆర్డిఏ పిడి నరసయ్య. dwmapd విజయ ప్రసాద్, డి పి ఓ విజయ్  కుమార్. ఇతర శాఖ అధికారులు తదితరులు  పాల్గొన్నారు

 

Comments