ప్రభుత్వ పధకాల లక్ష్యసాధనపై కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలి సిఎస్ డా.సమీర్ శర్మ

 ప్రభుత్వ పధకాల లక్ష్యసాధనపై కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలి సిఎస్ డా.సమీర్ శర్మ


అమరావతి,18 మే (ప్రజా అమరావతి):ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ చెప్పారు.బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో సిఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం జరిగింది.ఈసమావేశంలో ప్రధానంగా గత కార్యదర్శుల సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదిక(ATR), సుస్థిరాభివృధ్ధి లక్ష్యాల సాధన,సైబర్ సెక్యురిటి,ఎపి ఆన్లైన్ లీగల్ కేసులో మానిటరింగ్ సిస్టమ్ తదితర అంశాలపై సమీక్షించారు.ముందుగా యాక్షన్ టేకెన్ రిపోర్టు కు సంబంధించి ఆయా శాఖల వారీగా కార్యదర్శులు వివరించారు.ముఖ్యంగా వివిధ పధకాలు,కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయడం ద్వారా మెరుగైన ఫలితాల సాధనకు అన్ని శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ డా.సమీర్ శర్మ ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు.నాడు-నేడు కింద చేపట్టిన వివధ పనులు,నైపుణ్య శిక్షణాభివృద్ధి కార్యక్రమాలు,జాతీయ రహదార్లు,ఆర్ అండ్బి,పంచాయితీరాజ్ రహదార్లు అభివృద్ధికి చేపట్టిన చర్యలను ఆయా కార్యదర్శులు సిఎస్ కు వివరించారు.అదే విధంగా జగనన్న శాశ్వత భూహక్కు,జగనన్న సంపూర్ణ భూరక్ష పధకం,భూముల రీసర్వే,గ్రామాలు,పట్టణాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ తదితర అంశాలను సిఎస్ సమీక్షించారు.

ఎపి ఆన్లైన్ లీగల్ కేసు మేనేజిమెంట్ సిస్టమ్ (APOLCMS) గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మాట్లాడుతూ ఇదొక మంచి విధానమని లీగల్ కేసుల నిర్వహణకు సంబంధిత శాఖల్లో నియమించబడిన లైజన్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ఆయన ఆదేశించారు.సంబంధిత శాఖల లైజన్ అధికారులు ప్రతి రోజు ఈ ఎపిఓఎల్సియంను మానిటర్ చేస్తూ కోర్టుల్లో నమైదైన కేసు దానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ కార్యదర్శికి తెలియజేయడం ద్వారా ఆయా కేస్లులో సకాలంలో కౌంటర్లు దాఖలు చేయడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా కోర్టులకు సకాలంలో వివరాలు అందించాలని చెప్పారు.ఇకపై ప్రతినెల అడ్వకేట్ జనరల్ తో కలిసి జిపిలు,సంబంధిత శాఖల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి లీగల్ కేసులపై సమీక్షించడం ద్వారా ప్రభుత్వానికి సంబంధించి కోర్టు కేసుల పెండెన్సీని తగ్గించేందుకు వీలుగా కోర్టులకు సకాలంలో వివరాలు సమర్పించేందుకు కృషి చేయాల్సి ఉందని సిఎస్.డా.సమీర్ శర్మ పేర్కొన్నారు.

నీతి ఆయోగ్ నిర్దేశించిన ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆన్ని శాఖలు ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ కార్యదర్శులను ఆదేశించారు.ఇందుకుగాను అందరు కార్యదర్శులు ఈఅంశాన్నినిరంతరం మానిటర్ చేయాలని చెప్పారు.సుమారు 415 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు ప్రణాళికాశాఖ ఎస్ఓపిలు(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను)రూపొందించినట్టు ఆశాఖ కార్యదర్శి విజయకుమార్ వివరించగా అందుకు అనుగుణంగా ఆయా లక్ష్యాల సాధనకు తగిన చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను సిఎస్ డా.సమీర్ శర్మ ఆదేశించారు.అనంతరం సైబర్ సెక్యురిటీకి సంబంధించి రూపొందించిన డేటా బేస్ వివరాలను ఐటి మరియు కమ్యునికేషన్స్ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి వివరించారు.ఇంకా ఈసమావేశంలో వివిధ అంశాలకు సంబంధించి కార్యదర్శులతో సిఎస్ డా.సమీర్ శర్మ సమీక్షించారు.

ఈసమావేశానికి తొలుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ స్వాగతం పలికి అజెండా అంశాలను వివరించారు.సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సాయిప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్,బి.రాజశేఖర్,రజత్ భార్గవ,అనంతరాము,పూనం మాలకొండయ్య, అజయ్ జైన్, వై.శ్రీలక్ష్మి,పలువురు ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

  

Comments