గోరంట్లమండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
*: ఉపాధి పనులను, ఇంటర్మీడియట్ పరీక్షలను, గ్రామ సచివాలయం ని, రైతు భరోసా కేంద్రాన్ని, జగనన్న లే అవుట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్*
గోరంట్ల (శ్రీ సత్యసాయి జిల్లా), మే 25 (ప్రజా అమరావతి):
*శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ బుధవారం గోరంట్ల మండలంలో విస్తృతంగా పర్యటించారు.
గోరంట్ల మండలంలోని రెడ్డి చెరువు కట్ట గ్రామంలో, మలాల, చలమయ్య గారి పల్లిలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనులను అకస్మికంగా తనిఖీ చేశిన జిల్లా కలెక్టర్ ఉపాధి హామీ పథకం క్రింద ఆయా గ్రామ పంచాయితీలలో జరుగుతున్న ఉపాధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఈరోజు ఎంత మంది కూలీలు ఉపాధి పనులకు వచ్చారు, ప్రతిరోజు ఎంత మంది కూలీలకు పనులకు వస్తున్నారు, ఇప్పటివరకు ఎన్ని రోజులు పని చేశారు, ఎంత కూలీ డబ్బులు వచ్చింది, తదితర వివరాలను కూలీలతో ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ మంది కూలీలు ఉపాధి పనులకు వచ్చేలా కూలీలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతిరోజు 257 రూపాయల డబ్బులు వచ్చేలా పనిచేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం పనులను కూలీలు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా గ్రామ పంచాయతీలలో జరుగుతున్న ఉపాధి పనులకుసంబంధించిన కూలీల మస్టర్ లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
*అనంతరం జిల్లా కలెక్టర్ గోరంట్లమండల కేంద్రంలో జూనియర్ కళాశాల నందు జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను తనిఖీ చేశారు. విద్యార్థులకు అన్ని రకాల వసతి సదుపాయాలు కల్పించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలు వెంటనే బేస్మెంట్ స్థాయికి తీసుకు రావాలి
గోరంట్ల మండలం లో మారమ్మ అమ్మ గుడి కుడి ఎడమ వైపు ఉన్న జగనన్న హౌసింగ్ కాలనీలకు సంబంధించిన లే అవుట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్
*నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద జగనన్న హౌసింగ్ కాలనీలలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలు నిదానంగా జరుగుతున్నాయని, ఇళ్ల నిర్మాణంలో వెంటనే వేగం పెంచాలని హౌసింగ్ అధికారులను జిల్లా ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఇల్లు బేస్మెంట్ స్థాయికి నిర్మాణం పూర్తి చేసుకోవాలి, బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలు వెంటనే బేస్మెంట్ స్థాయికి తీసుకు రావాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం అయ్యేలా లబ్ధిదారులు, సంబంధిత అధికారులు సమావేశం ఏర్పాటు చేయాలని హౌసింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రతి రోజు పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని, ఇల్లు నిర్మించుకునేలా లబ్ధిదారులకి అవగాహన కల్పించాలన్నారు. ఇక్కడి కుడిలేఔట్ లో 415 ఇల్లు మంజూరు చేయగా, 25 ఇల్లు నాన్ స్టార్టెడ్ లో, బిలో బేస్మెంట్ స్థాయిలో 138 ఇళ్లు ఉండగా, 157 బేస్మెంట్ స్థాయిలో, ఆర్ఎల్ స్థాయిలో 48 ఆర్సీ స్థాయిలో 46 ఉన్నాయని, ఒక ఇల్లు పూర్తయింది . ఎడమ జగనన్న లేఅవుట్ నందు
167 ఇల్లు మంజూరు చేయగా, 5 ఇల్లు నాన్ స్టార్టెడ్ లో, బిలో బేస్మెంట్ స్థాయిలో 65 ఇళ్లు ఉండగా, 68 బేస్మెంట్ స్థాయిలో, ఆర్ఎల్ స్థాయిలో 13 ఆర్సీ స్థాయిలో 15 ఉన్నాయని, 1ఇల్లు పూర్తి అయ్యింది.
.ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి చంద్రమౌళి రెడ్డి, డ్వామా పిడి విజయ్ కుమార్, గోరంట్ల తాసిల్దార్ రామాంజనేయులు, ఎంపీడీవో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment