ఉట్రుమిల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం లో భాగంగా గ్రామంలో సుడిగాలి పర్యటన చేశారు.


 రామచంద్రపురం మే 31, (ప్రజా అమరావతి);


గత 3 సంవత్సరాలుగా వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలుపరచడం వాటిని ఆడపడుచులు సద్వినియోగం చేసుకొని సంతృప్తిని పొందటం గొప్ప విషయమని రాష్ట్ర బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ  సమాచార పౌర సంబంధాల శాఖామాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ తెలిపారు. మంగళవారం మంత్రి, రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని ఉట్రుమిల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం లో భాగంగా గ్రామంలో సుడిగాలి పర్యటన చేశారు.


 ఈ సందర్భంగా మంత్రి గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వపరంగా అందుతున్న లబ్ధి వారు వినియోగిస్తున్న తీరు తో పాటు సమస్యలు ఏమైనా ఉంటే  అడిగి తెలుసుకున్నారు.

అర్హులైన  ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని వీటిలో సాంకేతిక పరమైన అంశాలు ఏమైనా ఉంటే త్వరలో పరిష్కరించి లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు . ఈ సందర్భంగా మంత్రి నున్న వీరలక్ష్మి,  వాసన నాగ లక్ష్మి, దుర్గాదేవి ఇతర మహిళలను నేరుగా మాట్లాడుతూ వారికి అందుతున్న ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ,  అమ్మ ఒడి, ఆసరా, పెన్షన్,  కాపు నేస్తం తదితర సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న తీరును అడిగి తెలుసుకుని, సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు.


ఈ సందర్భంగా గ్రామంలో వాలంటరీగా పనిచేస్తున్న చప్పిడి వెంకట్రావు అనే వాలంట్రీ  ప్రమాదానికి గురైనందు న నేరుగా ఇంటికి వెళ్లి అతని అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది ,వాలంట్రీలు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 



Comments