ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం
విధులకు గైర్హాజరు అయిన ఐదు మంది వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు
జిల్లా కలెక్టర్
బుక్కపట్నం, మే 2 (ప్రజా అమరావతి); ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడమే మన ప్రధాన కర్తవ్యమని జిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్ తెలిపారు. సోమవారం బుక్కపట్నం మండలంలోని ప్రభుత్వఆసుపత్రిని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు . వివిధఆరోగ్య పథకాలు సంబంధించిన కార్యక్రమాలు, ఆసుపత్రి సేవలు. టీకాలు, ఓపి నమోదు, 104, 108, తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్, సీజనల్ వ్యాధులు, వైద్య నిపుణులు హాజరు పట్టిక, సిబ్బంది హాజరు పట్టికను, మందుల పట్టికను, వివరాలను ఆరా తీశారు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. సిబ్బంది హాజరు పట్టిన పరిశీలించగా గైర్హాజరైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మెడికల్ ఆఫీసర్ మమతాను ఆదేశించారు. హాజరు పట్టిక నందు జిల్లా కలెక్టర్ పేర్లు పిలువగా ఈ క్రింది కనపరిచిన సిబ్బంది లేరు. వారిలో 1. డాక్టర్ రామయ్య ఆయుష్ డాక్టర్,2. కే శంకర సీనియర్ అసిస్టెంట్,3. సాంబశివమ్మ హెడ్ నర్స్,4. హెల్త్ సూపర్వైజర్ N. శాంతి, 5.ఆరోగ్యమిత్ర కే రాజ్ కుమార్
తదితరులు ఉన్నారు, మెడికల్ ఆఫీసర్ కు కూడా షోకాజ్ నోటీసు జారీ చేయవలసిందిగా జిల్లా వైద్య శాఖ అధికారి కి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment