రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
మ్యాథ్ మెటిక్స్ పరీక్షకు 23,466 మంది 99.18 శాతం హాజరు
పరీక్షలు అనంతరం అత్యంత జాగ్రతగా జాబు పత్రాలు తరలింపు
- కలెక్టర్ డా. కె. మాధవీలత
జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో 3వ రోజు లెక్కలు పరీక్షకి 23,992 మంది హాజరు కావాలసి ఉండగా, 23,466 (97.81 %) మంది హాజరైనట్లు 526 మంది హాజరు కాలేదని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు.
సోమవారం ధవళేశ్వరం లోని బాలికొన్నత పాటశాలలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, జవాబు పత్రాల ప్యాకింగ్, తరలింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఈ రోజు జరిగిన పరీక్షలకి 23,466 మంది హాజరయ్యారని, 526 (2.19%) మంది గైరాజరు అయినట్లు ఆమె తెలిపారు.
పదవ తరగతి పరీక్షలు అనంతరం అత్యంత పకడ్బందీగా జవాబు పత్రాలను భద్రతా కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు డా. మాధవీలత తెలిపారు. ధవళేశ్వరం లోని బాలికల పాఠశాల లో పరీక్షల నిర్వహణ అనంతరం జవాబు తరలింపు ను, పార్సిల్ చేసే విధానం ను ఆమె దగ్గరుండి పరిశీలించి తగిన సూచనలు చేశారు.
addComments
Post a Comment