ఆంధ్రప్రదేశ్ ను టూరిజం హబ్ గా తీర్చి దిద్దుతా

 పెనుగొండ . మే.01 (ప్రజా అమరావతి);


          


 పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసి  యువతీ, యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ,ఆదాయం వనరులు రెండవ ప్రాధాన్యతను ఇవ్వాలి: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు శాఖమంత్రి శ్రీమతి ఆర్.కె .రోజా ... 

  

రాష్ట్రాన్ని పర్యాటక రంగాని అభివృద్ది చేసి, యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అని ఈ దిశగా రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని   రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు శాఖమంత్రి శ్రీమతి ఆర్.కె .రోజా అన్నారు.పెనుగొండ  మండలం దొంగరావిపాలెం  టూరిజం రిసార్టు ఆతిధి గృహంలో స్థానిక శాసనసభ్యులు చెరుకువాడ. శ్రీరంగ నాధ రాజు కలసి టూరిజం అధికారులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా మంత్రి మాట్లాడుతూ   పచ్చని పశ్చిమ గోదావరి నూతన జిల్లాకు మంత్రి గా ప్రమాణ స్వికారం చేసి తొలి సారిగా అధికార కార్యక్రమానికి వచ్చుట చాలా ఆనందంగా వుందని ,రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో నమ్మకంతో మంత్రి గా అవకాశం కల్పించారని ఆమె అన్నారు.అయన అశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ను టూరిజం హబ్ గా తీర్చి దిద్దుతానని , మన జిల్లాలో



టూరిజం కేంద్రాలు , అభివృద్ది చెయ్యవలసిన కేంద్రాలు , ప్రసిద్ది పుణ్య క్షేత్రాలు మండలాలు వారీగా అధికారులను మంత్రి అడిగితెలుసుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా పర్యాటక రంగం అభివృద్ధి జరుగుట,పర్యాటకులు రాకపోకలు లేకపోవుట వెనుక బడిపోయింది ఇది వాస్తవం అని అమె అన్నారు.ఇప్పుడు పరిస్థితిలు అనుకూలంగా ఉన్నాయి పనులు వేగవంతం చేయాలని పర్యాటకులు టూరిజం స్పాట్ కు వచ్చేందుకు సకల సౌకర్యాలు కల్పించాలని ఆమె సూచించారు.టూరిజం అధికారులు జిల్లా టూరిజం పై పూర్తి  సమాచారం , ఫోటోగ్రఫీ తో పూర్తి ప్రత్యేక డైరీ ని మంత్రి శ్రీమతి ఆర్ కె రోజాకు అధికారులు అందజేశారు.


ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి మెహర్ రాజ్ ,ఇతర అధికారులు , తది తరులు పాల్గొన్నారు.



Comments