జిల్లాలో సొంత పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోవచ్చు

 


రాజమహేంద్రవరం, (ప్రజా అమరావతి);


* జిల్లాలో సొంత పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోవచ్చు



* జిల్లాలో ఏర్పాటుకి  అనుకూలమైన వాతావరణం గల పరిశ్రమలను గుర్తించండి


* పారిశ్రామిక రంగం ద్వారా వ్యాపార అభివృద్ధికి ప్రోత్సాహకాలు


..కలెక్టర్ డా. కె మాధవిలత


 జిల్లా లో  సొంత పరిశ్రమల స్థాపనతో పాటు వారి వ్యాపారాభివృద్దికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ప్రోత్సాహ‌కాల‌ను అందిస్తున్నాయని జిల్లా కలెక్టరు డా.కె.మాధవిలత అన్నారు. రాష్ట్రంలో సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.


బుధవారం స్థానిక కలెక్టరేట్  సమావేశ మందిరంలో జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధిపై జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో అనుబంధ శాఖలైన ట్రాన్స్ పోర్టు, ఏపీఐఐసీ, మత్స్యశాఖ, ఏపీఈపిడిసిఎల్, ఏపీపీసిబి,  గ్రౌండ్ వాటర్, చిన్న తరహా పరిశ్రమలు  ఇతర శాఖల అధికారులు, పలు ఏజెన్సీలతో  కలెక్టర్  చర్చించారు.


ఈ సందర్భంగా కలెక్టరు మాధవీలత  మాట్లాడుతూ,  జిల్లాలో మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ   వర్గాలకు చెందిన  ఆసక్తి ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు  పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టి, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు చేయూత నందించాలన్న లక్ష్యంతో కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తున్నా య‌న్నారు. జిల్లాలో ఏర్పాటుకి  అనుకూలమైన వాతావరణం గల పరిశ్రమలను గుర్తించి, నివేదిక అందచేయాలని, ఆయా రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఆసక్తి ఉన్న వారు నూతన పరిశ్రమలు స్థాపించి వ్యాపారం రంగంలో అభివృద్ది సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తద్వారా మరి కొందరికి ఉపాధి కల్పన కల్పించాలని అనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు.  నూతన పాలసీ ప్రకారం పియంఈజీపి, స్టాండప్ ఇండియా వంటి కేంద్ర ప్ర‌భుత్వ పథకాలతో పాటు,  జగనన్న బడుగు వికాసం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 45 శాతం, కేంద్రం 25 శాతం సబ్సిడి  మొత్తం రూ. 70 లక్షల వరకు రాయితీని  అందిస్తుందన్నారు.  పరిశ్రమల స్థాపనకు అర్హత గల వారందరూ ముందుకు వచ్చి వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ మేరకు పరిశ్రమస్థాపించాలనే ఆసక్తి అర్హులైన వారందరూ ఈ పథకాలు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.


జిల్లాలో ఈ ఏడాది పరిశ్రమల శాఖ ద్వారా 60 యూనిట్లు స్థాపనలు ఏర్పాటు కు లక్ష్యం గా  నిర్ణయించామని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ఈ మేరకు తగిన ప్రతిపాదనలు, ప్రాజెక్ట్ రిపోర్ట్ లతో  సొంత పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.  ప్రధానమంత్రి  ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పథకం కింద(PMEGP) యూనిట్ విలువ మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ కు రూ. 25 లక్షలు, సర్వీస్ సెంటర్ కు గాను రూ.10 లక్షలుగా ఉంటుందన్నారు. ఓసి పురుషులకు అర్బన్ ప్రాంతంలో 15 శాతం, రూరల్ ప్రాంతంలో 25% శాతం, సబ్సిడీ కాగా లబ్ధిదారులు కంట్రిబ్యూషన్ 10 శాతం ఉండాలన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, ఉమెన్, మైనారిటీస్, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అర్బన్ ప్రాంతంలో 25 శాతం రూరల్ ప్రాంతంలో 35 శాతం, లబ్ధిదారులు కంట్రిబ్యూషన్  5 శాతం గా నిర్ణయించారన్నారు. సొంత వ్యాపారం చేసుకునే వారికి బ్యాంకర్లు రుణ సహాయంగా అందిస్తారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఏ ఏ పరిశ్రమలు అనువుగా ఉంటాయో ముందుగానే అటు వంటి ప్రాంతాలలో యూనిట్లు ఎంపికకు పర్యవేక్షణ అవసరమని జిల్లా పరిశ్రమల శాఖ అధికారికి కలెక్టర్ సూచించారు


తొలుత జిల్లాలో పరిశ్రమల శాఖ ద్వారా చేపట్టి అమలు చేస్తున్న కార్యక్రమాలను జిల్లా పరిశ్రమల అధికారి డి. వెంకటేశ్వరరావు సమావేశంలో అధికారులకు సభ్యులకు వివరించారు.


సమావేశంలో జిల్లా ఎస్సీ వెల్ఫేర్ మరియు ఎంపవర్మెంట్ అధికారిని ఎమ్మెస్ శోభారాణి చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ శ్రీనివాస్, ఏపీ ఈపీడీసీఎల్ అధికారి శామ్యూల్ వివిధ శాఖల అధికారులు, ఇండస్ట్రీస్ అసోసియేషన్ అడ్వైజర్ ఎం. వెంకట్రావు, డిక్కీ కోఆర్డినేటర్ వై రాజీవ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.



Comments