*ఐరన్ లెగ్ సీఎం జగన్*
*రిషి కొండ, వైజాగ్ లో భూకబ్జాలు, అక్రమాల సంగతి తేలుస్తాం*
*భూకబ్జాలు, అక్రమాల సంగతి తేల్చుతాం*
*టెన్త్ పేపర్ లీక్ వెనుక వైసీపీ నేతల హస్తం*
*వివేకా హత్య కేసు ఏమయ్యింది? ఆయన కుమార్తె పోరాటానికి న్యాయం జరగాలి*
*హత్యా రాజకీయాల విష సంస్కృతి పోవాలి
*
*రాష్ట్రంలో దద్దమ్మ,చేతగాని ప్రభుత్వం ఉంది*
*జగన్ కు పాలించే అర్హత లేదు*
*డీజిల్,పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించరని నిలదీస్తున్నా*
*ఏపీ కంటే ఇతర రాష్ట్రాలలో పన్నులు ఎక్కువని నిరూపిస్తే రాజకీయాలు శాశ్వతంగా వదులుకుంటా*
*తాళ్ళ వలస సభలో చంద్రబాబు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు*
*విశాఖపట్నం (ప్రజా అమరావతి) : తన కాన్వాయ్ నిలిపివేయడంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. తాను హత్యలు, గూండాయిజం చేసేవాడిని కాదని, రిషికొండకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో తాము ఎప్పుడూ ఇలా చేయలేదని చంద్రబాబు అన్నారు. తమ పాలనలో పోలీసులు ఇలా వ్యవహరించలేదని, తాము రిషికొండ వెళ్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషికొండ, వైజాగ్‌లో భూకబ్జాలు, అక్రమాల సంగతి తేల్చుతామని చంద్రబాబు హెచ్చరించారు.*
*సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్ : సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. మన రాష్ట్రంలో ఐరన్ లెగ్ సీఎం జగన్ ఉన్నారంటూ విశాఖపట్నం జిల్లాలోని తాళ్లవలసలో జరిగిన సభలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అన్యాయం మనం ఎన్నడూ చూడలేదని, నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని చంద్రబాబు మండిపడ్డారు. దేశంలో కల్లా పెట్రోధరలు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. సీఎం జగన్‌కు చంద్రబాబు సవాలు విసిరారు. ఏపీ కంటే ఇతర రాష్ట్రాల్లో పెట్రో ధరలు అధికంగా ఉంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు ప్రకటించారు. కోర్టు ఆదేశంతో గ్రామ సచివాలయాల రంగులు మార్చారని, రంగుల మార్పు కోసం ప్రజాధనాన్ని వృథా చేశార నిచంద్రబాబు మండిపడ్డారు. టెన్త్ పేపర్ లీక్ వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని, నాడు-నేడు అంటూ పాఠశాలలకు వైసీపీ రంగులు వేశారని, తన పోరాటం తన కోసం కాదని, మీ కోసం అని చంద్రబాబు అన్నారు.పెళ్లి అయితే కళ్యాణ కానుక, పండుగ అయితే పండుగ కానుక ఇచ్చామని చంద్రబాబు చెప్పారు.*
*విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు : రుషికొండ వెళ్లేందుకు అనుమతి లేదన్న పోలీసులువిశాఖలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులువిశాఖ రుషికొండ హరిత రిసార్ట్స్‌లోని నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్లిన తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండ వెళ్లేందుకు చంద్రబాబు బృందానికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఎండాడ జంక్షన్ వద్దే ఆయన్ను అడ్డుకున్నారు. జాతీయ రహదారిపైనే చంద్రబాబు వాహనశ్రేణిని నిలిపేశారు. దీంతో ఎండాడ నుంచి తాళ్లవలసకు చంద్రబాబు బయల్దేరి వెళ్లారు. "రుషికొండకు వెళ్తానంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంది ? కట్టేది పర్యాటక ప్రాజెక్టే అయితే ఉలికిపాటు ఎందుకు? విశాఖలో వైకాపా నేతల కబ్జాలు, ఆక్రమణలను వదిలిపెట్టను. పర్యావరణాన్ని నాశనం చేస్తూ రుషికొండను పిండి చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.
addComments
Post a Comment