జిల్లాలో విద్య, వైద్య రంగాల్లో దొడ్ల కుటుంబం సేవలు ఎనలేనివి


నెల్లూరు, మే 15 (ప్రజా అమరావతి): జిల్లాలో విద్య, వైద్య రంగాల్లో దొడ్ల కుటుంబం సేవలు ఎనలేనివ



ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి కొనియాడారు. 

 ఆదివారం మధ్యాహ్నం పొదలకూరు మండల పరిధిలోని మహమ్మదాపురం హైస్కూల్లో దొడ్ల డెయిరీ చైర్మన్ శ్రీ దొడ్ల శేషారెడ్డి  ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార సభలో మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు పాల్గొన్నారు. 

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దొడ్ల కుటుంబం ఇక్కడ జన్మించడం మహమ్మదాపురం గ్రామం చేసుకున్న అదృష్టమన్నారు. గ్రామంలోని పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణాలకు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు దొడ్ల కుటుంబం ఎప్పుడూ ముందుంటుందన్నారు. జిల్లా కేంద్రంలోని డీకే డబ్ల్యూ కళాశాల, దొడ్ల సుబ్బారెడ్డి ప్రధాన వైద్యశాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సుపాలన అందిస్తున్నారని, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మాట్లాడినప్పుడు వారు  ముఖ్యమంత్రి పరిపాలన పట్ల విశ్వాసం, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని, ప్రజలు సంతోషంతో తమకు స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు.

  జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు మాట్లాడుతూ రైతులకు సంక్షేమ ఫలాలు సకాలంలో అందించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందన్నారు. 

 అనంతరం మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, కలెక్టర్ చక్రధర్ బాబును దొడ్ల డెయిరీ చైర్మన్ దొడ్ల శేషారెడ్డి, సీఈఓ జీవీకే రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. 

 ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీ కొండయ్య, ఎంపీడీవో సుజాత, పొదలకూరు పిఎసిఎస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, జెడ్పిటిసి నిర్మలమ్మ,  ఎంపీపీ సుబ్బరాయుడు, సర్పంచ్ ప్రత్యూష పాల్గొన్నారు. 


Comments