రహదారి వంతెనను పరిశీలించిన జిల్లా కలెక్టర్
శ్రీసత్యసాయి జిల్లా , మే 20 (ప్రజా అమరావతి); హిందూపురం నుండి బెంగళూరుకు వెళ్లే మధ్య మార్గంలోని బసవన్న పల్లి వంతెనను జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ శుక్రవారం రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. కర్ణాటక ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మరియు పెన్నా నది పొంగి పోవడం వల్ల ఈ వంతెన బాగా దెబ్బతిన్నట్లు అధికారులుగుర్తించారు. ప్రజల రాకపోకల ఇబ్బంది కలగకుండా దృష్ట్యా పెట్టి,వెంటనే తాత్కాలిక మరమ్మతులు చర్యలు చేపట్టి కాజల్ ప్రజలు తిరిగి రాక పోకలు కొనసాగించే దిశగా పనులను చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులనుఆదేశించారు. అలాగే వంతెన పనుల నిర్మాణానికి సంబంధించిన విషయాలపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడుతానని కలెక్టర్ తెలిపారు. త్వరలో శాశ్వత ప్రతిపాదన వంతెన నిర్మాణ పనుల కోసం నివేదికను తనకు సమర్పించాలని కలెక్టర్ అధికారులను సూచించారు.ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ సూపరిటెo డెంట్ ఓబుల రెడ్డి, ఇఇ సంజీవయ్య, డి ఇ నాగరాజు, జెఈ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment