తిరుపతిలో చిన్నపిల్లల సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రికి రేపు సీఎం శ్రీ వైయస్. జగన్ శంకుస్థాపన

 

అమరావతి (ప్రజా అమరావతి);


*– తిరుపతిలో చిన్నపిల్లల సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రికి రేపు సీఎం శ్రీ వైయస్. జగన్ శంకుస్థాపన*


– రాష్ట్ర విభజనకు ముందు పిల్లలకోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రి.

– రాష్ట్ర విభజన తర్వాత చిన్నపిల్లలకోసం రాష్ట్రంలో చిన్నపిల్లల ప్రత్యేక ఆస్పత్రి లోటు. 

– సూపర్‌స్పెషాల్టీ సేవలకోసం ప్రయివేటు ఆస్పత్రులపై ఆధారపడ్డ పరిస్థితి.

– సమగ్ర చికిత్సలకోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు. 

– అన్నిరకాల సదుపాయాలను పేద కుటుంబాల్లోని పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

– దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌. 

– అత్యాధునిక ఆస్పత్రుల్లోని సేవలు పేద కుటుంబాల్లోని చిన్నారులకూ అందాలని సీఎం దిశానిర్దేశం. 

– దీనికోసం తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో చిన్నపిల్లలకోసం సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలన్న సీఎం. 

– ఈ ఆస్పత్రుల్లో వైద్య విద్యార్థులకు, పీజీ వైద్య విద్యార్థులకు శిక్షణ, పరిజ్ఞానం పెంపు కార్యక్రమాలు చేపట్టేదిశగా ఆస్పత్రులను తీర్చిదిద్దాలన్న సీఎం. 

– ఈ ఆస్పత్రుల్లో రెండు, మూడేళ్లలో సూపర్‌ స్పెషాల్టీ పీడ్రియాక్‌ కోర్సులను ప్రవేశపెట్టేదిశగా కార్యాచరణ.

– స్టాఫ్‌ నర్సులకు, పారామెడికల్‌ సిబ్బందికి, ఇతర వైద్య సిబ్బందికి పరిజ్ఞానం బదిలీచేయడంతోపాటు మంచి శిక్షణ కూడా ఇచ్చేదిశగా ఆస్పత్రులను నిర్మించనున్న ప్రభుత్వం.

– మొదటగాఒక్కో ఆస్పత్రిలో  200 బెడ్ల స్థాయిలో చిన్నారులకు సూపర్‌ స్పెషాల్టీ సేవలు, తర్వాత 500 బెడ్ల స్థాయికి పెంపు. 

– కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్‌ సర్జరీ, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ తదితర రంగాల్లో చిన్నారులకు సేవలు అందించనున్న ఆస్పత్రులు. 

– మొత్తం 17 విభాగాలను ఒక్కో ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం.

–అత్యాధునిక లాబొరొటరీ, ఆపరేషన్‌థియేర్లు, ఐసీయూ విభాగాల ఏర్పాటు.

– 2 నుంచి 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆస్పత్రి నిర్మాణం, ఒక్కో ఆస్పత్రి కోసం రూ.150 కోట్ల నుంచి రూ.200కోట్ల ను ఖర్చుచేయనున్న ప్రభుత్వం.

Comments