రాష్ట్ర మహిళా,శిశు, దివ్యాంగుల,వయో వృద్ధుల సంక్షేమ కమిటీ సభ్యులు అరుణాచల ప్రదేశ్ పర్యటన

 *రాష్ట్ర మహిళా,శిశు, దివ్యాంగుల,వయో వృద్ధుల సంక్షేమ కమిటీ సభ్యులు అరుణాచల ప్రదేశ్ పర్యటన


*

అరుణాచలప్రదేశ్ (ఇటానగర్), మే 26 (ప్రజా అమరావతి):  గిరిజనులు, మహిళలు,శిశువులు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమం కొరకు రాష్ట్రంలో మరిన్ని మెరుగైన పథకాలను అమలు పర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర మహిళా,శిశు, దివ్యాంగుల,వయో వృద్ధుల సంక్షేమ కమిటీ అరుణాచలప్రదేశ్ పర్యటనకు వెళ్లింది. రాష్ట్ర మహిళా,శిశు, దివ్యాంగుల,వయో వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్ పెర్సన్ మరియు పాలకొండ శాసనసభ్యులు విశ్వాసరాయి కళావతి నేతృత్వంలో సభ్యులు పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ, నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్ మోహన్ రావు ఈ పర్యటనలో పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పి.డి సోన రాష్ట్ర రాజధాని ఇటానగర్ లో   ఈ కమిటీ సభ్యులకు సాదర స్వాగతం పలికారు. తమ రాష్ట్రంలో  గిరిజనులు, మహిళా,శిశువులు,దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమం కోసం అమలు పరుస్తున్న పలు పధకాలను వివరించారు. ఈ సందర్భంగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా,శిశు, దివ్యాంగుల,వయో వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ మరియు మెంబెర్స్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో గిరిజనులు, మహిళా, శిశువులు, దివ్యాంగులు మరియు వయో వృద్ధులు  సంక్షేమం కోసం అమలు పరుస్తున్న పలు పథకాలను అరుణాచల ప్రదేశ్  స్పీకర్ కు, అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మహిళాల రక్షణకు ప్రత్యేకంగా అమలు పరుస్తున్న దిశ చట్టం, పలు వర్గాల సంక్షేమం కోసం అమలు పరుస్తున్న నవరత్నాలు, మనబడి నాడు - నేడు, గ్రామ సచివాలయలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ది తదితర కార్యక్రమాలతో పాటు గిరిజన సంక్షేమార్థం అమలు పరుస్తున్న పథకాలను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించారు. 

ఈ పర్యటనలో డిప్యూటీ సెక్రటరీ విజయ రాజు, సెక్షన్ ఆఫీసర్ సతీష్, మరియు పలు అధికారులు పాల్గొన్నారు.


Comments