వ్యవసాయ సలహా మండలి తొలి సమావేశంరాజమహేంద్రవరము, (ప్రజా అమరావతి);. వ్యవసాయ సలహా మండలి తొలి సమావేశంనూతనంగా తూర్పు గోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా వ్యవసాయ సలహా మండలి తొలి సమావేశం నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. 


బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. 


తొలుత జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ గా బూరుగుపల్లి సుబ్బారావు భాద్యతలు స్వీకరించారు. కమిటీ సభ్యులుగా గా కంతేటి వినయ్ తేజ, కమm ఎస్. అమ్మిరెడ్డి ,సింగంశెట్టి శ్రీనివాసరావు, ఎల్ శ్రీనివాసరావు, కె రామ్మోహన్ రెడ్డి, ఎం నరసింహారావు, కె. చిన్నయ్య, ఎం మంగతాయారు, దాసరి శివ కుమార్ లు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.


ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎస్. మల్లిబాబు, సత్య గోవిందం , ఎస్ మాధవరావు, తదితరులు పాల్గొన్నారు


Comments