రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి) ;
* పెండింగ్ లో ఉన్న సచివాలయ, అర్భికే, హెల్త్ క్లినిక్ ప్రభుత్వ భవనాల పురోగతి వేగవంతం చెయ్యాలి..
* నిర్దేశించిన మేరకు వారం వారం లక్ష్యాలను అధిగమించాలి..
- కలెక్టర్ డా. కె. మాధవీలత
క్షేత్రస్థాయిలో ప్రభుత్వ భవన నిర్మాణ పనుల పురోగతిని వేగవంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మండల స్థాయిలో అర్భికే లు, సచివాలయాలు, వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్స్ భవనాల నిర్మాణంపై పి ఆర్ ఎస్ ఈ ఎ బి వి ప్రసాద్ తో కలిసి కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.కే మాధవీలత మాట్లాడుతూ, అర్భికే లు, సచివాలయాలు, వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్స్ భవనాల నిర్మాణాలు కోసం కాంట్రాక్టర్ లకు చెల్లింపుల విషయంలో ఎటువంటి జాప్యం జరిగే అవకాశం లేదన్నారు. ఇప్పటికే వివిధ దశల్లో ఉన్న భవన నిర్మాణ పనులు తదుపరి దశకి చేరుకునేలా ఇంజినీరింగ్ సహాయకులు ఏ ఈ లు పనుల్లో పురోగతి సాధించాల్సి ఉందన్నారు. ఆయా భవన పనులు కి అవసరమైన సిమెంట్, ఐరన్ వంటి మెటీరియల్ ను కాంట్రాక్టర్ ద్వారా ముందస్తు గా ఏర్పాటు చేసుకోవాలని, లేదా లోన్ బేసిస్ పై అధికారులే సమకూర్చుకునే ఆలోచన చేయాలన్నారు. పనులకు సంబందించిన చెల్లింపునకు నిధుల కేటాయింపు విషయంలో ఎటువంటి ఇబ్బందులూ లేవన్న వాస్తవాన్ని కాంట్రాక్టర్ లకు తెలియచెయ్యాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయా పనులు త్వరగాపూర్తి చేసెలా అధికారులను ఆదేశించినట్లు ఎస్ ఈ కలెక్టర్ కి తెలిపారు. సచివాలయాలు 6 టార్గెట్ ఒకటే సాధించాం, మొత్తం ఫిజికల్ స్టేజ్ లో 74 ఉంటే ఆరే ఎందుకు పెట్టారని, వొచ్చే వారానికి అన్నింటినీ లక్ష్యాల్లో చూపే ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. మొత్తం జిల్లాలో ఇంకా ప్రారంభించనవి 11 ఉంటే అన్నీ కూడా వొచ్చే వారం నాటికి పనులు ప్రారంభించాలన్నారు. చెల్లింపులకు జాప్యం జరిగే అవకాశం లేదన్నారు. వివిధ దశల్లో బేస్మెంట్, లింటల్, స్లాబ్, తదితర అంశాలపై ప్రగతి దిశగా అడుగులు వేయాలన్నారు. ఇంకా ప్రారంభం కానివీ అర్భికెలు. ..12 కి గాను 5 , వైఎస్ ఆర్ హెల్త్ క్లినిక్స్ ..10 కి గాను రెండు మాత్రమే ప్రారంభించడం ఏమిటని వివరణ కోరారు. ప్రతి గురువారం ప్రధాన కార్యదర్శి వీసీ నిర్వహిస్తున్న దృష్ట్యా ఇతర జిల్లాలో చేస్తున్న ప్రణాళికలు నుంచి వివరాలు సేకరించి వాటిలో ఉత్తమమైన పద్ధతులను తీసుకుని లక్ష్యా లను సాధించే దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ సూచించారు.
అనపర్తి, ఖండవల్లి (పెరవలి) లో కోర్టు కేసుల వలన జాప్యం జరుగుతుందని పంచాయతీ రాజ్ ఎస్ ఈ. ఎబివి ప్రసాద్ వివరణ ఇచ్చారు. జిల్లాలో ఇంకా అర్భికెలు 31, హెల్త్ క్లినిక్స్ 46 ఇంకా ప్రారంభం కానివి ఉన్నాయన్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ లతో ఎస్ ఈ మాట్లాడుతూ, గ్రౌండ్ నుంచి మొదటి అంతస్తు స్లాబ్ వరకు, లింటల్ స్థాయి లో ఉన్న వాటి ప్రగతి ఒకటిలాగే ఉంటాయి. దీనిని తదుపరి స్టేజ్ గా చెప్పడం సాధ్యం కాదు కాబట్టి మీరు మీ మీ మండలాల్లో ఆయా భవన నిర్మాణం పనులు తదుపరి స్టేజ్ కి తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని ప్రసాద్ స్పష్టం చేశారు. కోర్టుకేసులు మినహా మిగిలిన అన్నింటినీ వచ్చే సోమవారం నాటికి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
addComments
Post a Comment