కరకట్ట రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలి

 

 అమరావతి (ప్రజా అమరావతి):

 


 *కరకట్ట రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలి


.* 


 *సి ఆర్ డి ఏ పై పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమీక్ష.*


కరకట్ట రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు.

సచివాలయం రెండో బ్లాక్ లో APCRDA అధికారులతో సమావేశమై CRDA పనుల ప్రగతిని మంత్రి సురేష్ సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా APCRDA పరిధి, అధికారాలు, విభాగాల వారీ అధికారులు, వారు నిర్వహిస్తున్న పనుల ప్రగతిని మంత్రికి APCRDA కమిషనర్ వివేక్ యాదవ్ వివరించారు.  APCRDA ప్లానింగ్, ఎస్టేట్స్, ఇంజినీరింగ్, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, అకౌంట్స్ తదితర విభాగాలకు చెందిన  అధికారులు ఈ సమీక్ష లో పాల్గొన్నారు.


ఈ సందర్బంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.....


కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగంగా చేయాలని ఆదేశించారు. సిఆర్డిఏ అధికారులు, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో పనులు పర్యవేక్షించాలన్నారు.


పనికి అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంబాలు మార్చటం జరుగుతుందని, వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని సంబంధిత అధికారులు చెప్పారు.


పట్టణాభివృద్ధిలో భాగమైన గృహ నిర్మాణాలు పురోగతి, ఇతర భవన నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి, బిల్లుల చెల్లింపులు ఇతర అన్ని అంశాలపై మంత్రి సమీక్షించారు.


పట్టణాల్లో విద్యా, వైద్యం, పారిశుధ్యం పరిస్థితులు, వీధి లైట్లు తదితర అంశాలపై సమీక్షించారు.


అనంతరం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలపై కమీషనర్ ప్రవీణ్ కుమార్ ఇతర అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.


చెత్త సేకరణ కోసం రంగులతో కూడిన 3 బుట్టలు 1.13 కోట్లు పంపిణీ చేశామని, కేవలం 8 లక్షలు 10 యూఎల్బి లలో పంపిణీ చేయాల్సి ఉందని వాటిని కూడా ఈ నెలాఖరు నాటికి పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.


123 మున్సిపాలిటీల్లో ఇంకా 22 చోట్ల వివిధ కారణాలతో ఎన్నికలు జరగాలని, నిలిచిపోవటానికి కారణాలను అధికారులు వివరించారు.



Comments