రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
* స్పందనలో స్వీకరించిన అర్జీల ను నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలి
ఫిర్యాదుల తిరస్కరణ విషయంలో అందుకు గల సరైన కారణాలు అర్జీదారునికి స్పష్టంగా తెలపాలి
అర్జీలు రీఓపెన్ కు తావు లేకుండా సమగ్ర పరిశీలన చేసి పూర్తి స్థాయిలో పరిష్కరించాలి.
- కలెక్టర్ డా. కె. మాధవీలత
ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందలో వచ్చిన అర్జీలపై అధికారులు దృష్టి సారించి నిర్ణీత కాలవ్యవది లొనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తదితర జిల్లాఅధికారులతో కలిసి కలెక్టరు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ ఈ వారం ప్రజల నుంచి 132 అర్జీదారులు స్పందన ఫిర్యాదులు అందచేసారన్నారు. జిల్లాలో అన్ని రెవెన్యూ, మండల, సచివాలయాలలో ప్రజలనుంచి అర్జీలు స్వీకరించారన్నారు. సామాజిక పెన్షన్, భూమి సంబంధ అంశాలు, ఇండ్ల స్థలాలు, భూముల సరిహద్దు వివాదాలు, రేషన్ కార్డులు, ఇసుక, గృహ నిర్మాణం, తల్లిదండ్రులను చూడడం లేదని, తదితర సమస్యల పరిష్కారం కొరకు అర్జీ లను అందచేశారన్నారు. విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తుండడం తో సంక్షేమ పథకాలను పొందలేక పోతున్నామని పేర్కొన్నారని, వీటిపై రానున్న రోజుల్లో ప్రత్యేక దృష్టి పెట్టి, అర్హులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అత్యవసరం అయిన ఫైల్స్ తప్ప మినహా మిగిలిన అన్ని ఫైల్స్
ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ-ఆఫీస్ ద్వారానే జరగాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి అన్నీ కార్యాలయాల ఉన్నతాధికారులు ఇ- ఆఫీస్ వివరాలు సమర్పించాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఇంకనూ కొన్ని కార్యాలయాలకు కేటాయించిన సామాగ్రి రాలేదని, వారికి కేటాయించిన సామాగ్రిని వెంటనే తెప్పించుకోవాలన్నారు. స్వంత ఇంటి మాదిరిగా కార్యాలయాల్లో వసతులు సమకూర్చుకుని పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన ఫిర్యాదు లను ప్రభుత్వ మార్గదర్శకాలకి లోబడి పరిష్కారం చూపించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు లో మరింతగా ప్రగతి చూపాలి, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ సిద్దం చెయ్యాలని కలెక్టర్ ఆదేశించారు.
స్పందన అర్జిదారుల కోసం :
వేసవి దృష్ట్యా కలెక్టరేట్ ప్రాంగణంలో టేంట్ ఏర్పాటు, శుద్ధమైన త్రాగునీరు, మజ్జిగ ఇతర సౌకర్యాలు
ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రత్యేక ఉచిత బస్సు సర్వీసు
ప్రతి ఫిర్యాదు ఆన్ లైన్ లో నమోదు గుర్తింపు రశీదు జారీ
దివ్యంగుల వద్దకి వొచ్చి సమస్య తెలుసుకున్న కలెక్టర్
ఈ స్పందన కార్యక్రమం లో జేసీ సిహెచ్.శ్రీధర్, డీఆర్వో బి. సుబ్బారావు, జిల్లా అధికారులు డిఎంహెచ్ఓ డా. స్వర్ణలత, డిహెచ్ఓ బి. తారాచంద్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్. మాధవరావు, సీపీఓ శ్రీమతి పి.రాము, డిఎమ్ సివిల్ సప్లై కె.తులసి, డిఎస్ఓ పి.ప్రసాదరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.ఎస్టిజి సత్యగోవిందం ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment