ఆస్తినష్టం, పంట నష్టం అంచనాల తయారీలో ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

 

నెల్లూరు మే 14 (ప్రజా అమరావతి);


అసని తుఫాను వల్ల ఆస్థినష్టం అంచనాల తయారీలో నష్టపోయిన రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు. 


శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని శంకరన్  హాల్లో అసని తుఫాన్ ఆస్తినష్టం అంచనాల తయారీ గురించి జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్  చక్రధర్ బాబు మాట్లాడుతూ అసని తుఫాను పలు మలుపులు తిరుగుతూ జిల్లాకు నష్టం మిగిల్చిందన్నారు. ఉలవపాడు పరిసర ప్రాంతాలలో అత్యధిక వర్షపాతం నమోదైందన్నారు. కందుకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాలు తుఫానుకు  ప్రభావితమయ్యాయన్నారు. ఆస్తినష్టం, పంట నష్టం అంచనాల తయారీలో ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. 



ఈ సంధర్బంగా మంత్రి శాఖల వారీగా సమీక్షించారు. ముఖ్యంగా వ్యవసాయం, ఉద్యానవన శాఖలలో జరిగిన పంటనష్టం వివరాలను రైతుకోణంలో ఆలోచించి నమోదు చేయాలన్నారు. ఉద్యానవన పంటలను చిన్న రైతులు సాగు చేస్తుంటారని, పెట్టుబడి ఎక్కువగా ఉంటుందని,అందువల్ల ఎన్యుమరేషన్ పక్కాగా జరగాలని అధికారులను కోరారు.దెబ్బతిన్న రైతులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలన్నారు. అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించి త్వరలో సాగునీరు విడుదల చేస్తున్నందున, ఆయా చెరువులు, కాలువలకు పడిన గండ్లు పూర్తి చేయుటకు చర్యలు 

తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఇలాంటి విపత్తుల సమయంలో విద్యుత్ సౌకర్యం నిలిచిపోయి పంచాయితీలలో మంచి నీటి మోటార్లు పనిచేయని పరిస్థితుల్లో, ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందించేందుకు ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులు ముందస్తు చర్యలు 

తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా తుఫాను అనంతరం ఆయా ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని, తదనుగుణంగా వైద్యాధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. 


అన్నింటికన్నా ముఖ్యంగా తుఫాను సమయంలో వేగంగా స్పందించి నష్టాన్ని గణనీయంగా తగ్గించడానికి ముందస్తు చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులకు ప్రత్యేక అభినందనలన్నారు.


ఈ సమీక్ష సమావేశంలో కందుకూరు, ఉదయగిరి శాసనసభ్యులు మానుగుంట మహీధర రెడ్డి , చంద్రశేఖర రెడ్డి, జాయింట్ కలెక్టర్ హరేన్ధిర ప్రసాద్, డి ఆర్ ఓ వెంకట నారాయణమ్మ, జిల్లా వ్యవసాయ అధికారి  సుధాకర్ రాజు, పి ఆర్ ఎస్ఇ వేణుగోపాల్, ఇరిగేషన్ ఎస్ఇ కృష్ణ మోహన్,డి పి ఓ ధనలక్ష్మి , ఆర్ అండ్ బి ఎస్ఇ  రామాంజనేయులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పెంచలయ్య తదితరులు పాల్గోన్నారు .



Comments