వంద రోజులు ఉపాధి కల్పించాలి


 ద్విచక్ర వాహనంపై వెళ్లి ఉపాధి పనులను పరిశీలించిన శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్


వంద రోజులు  ఉపాధి కల్పించాలి


జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్


బుక్కపట్నం(శ్రీ సత్యసాయి జిల్లా),  మే 7 (ప్రజా అమరావతి) :


శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ తానొక సామాన్యుడిలా మారారు. ద్విచక్ర వాహనంపై వెళ్లి ఉపాధి పనులను పరిశీలించారు. ఉపాధి కూలీలకు భరోసానిచ్చారు. వేసవి ఎండలు మండుతున్న దృష్ట్యా ఎవరూ వడదెబ్బకు గురికాకూడదని, కూలీలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచనలు జారీ చేశారు. కూలీల దాహార్తిని తీర్చేలా వారికి మంచినీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.*


*శ్రీ సత్యసాయి జిల్లా  బుక్కపట్నం మండలంలోని పాముదుర్తి  నందు  కంఠత కందకాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను  శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో ఎండలు మండుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని కులీలకు సూచించారు. కూలీలకు తాగునీటి వసతి కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ లను ఆదేశించారు. ఉపాధి పనులపై క్షేత్రస్థాయిలో కులీలకు అవగాహన కల్పించాలన్నారు. ఎక్కువ మంది కూలీలు ఉపాధి పనులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజులు పాటు పని కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం 257 రూపాయలకు తగ్గకుండా ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కూలీలు తో కలిసి జిల్లా కలెక్టర్ గ్రూప్ ఫోటో దిగారు



ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ,  వెంకట రామి రెడ్డిఎపిడీ,  రఘునాథ రెడ్డి, ఏ పీ ఓ  రషీద్, ఫీల్డ్ అసిస్టెంట్ లు, ఉపాధి కూలీలు, తదితరులు పాల్గొన్నారు.



Comments