రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
తూర్పు గోదావరి జిల్లాలో జాతీయ రహదారుల పై కలెక్టర్ సమీక్ష
నూతనంగా తూర్పు గోదావరి జిల్లా ఏర్పడిన తదుపరి జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారుల సమగ్ర సమాచారం పై సమీక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు.
గురువారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలిసి పిడి (ఎన్.హెచ్) డి సురేంద్ర నాథ్ తో చర్చించారు..ఈ సందర్భంగా , జిల్లాలో ఎన్ హెచ్ 16 రాజానగరం నుంచి గుండుగొలను వెళ్ళే రహదారి జిల్లా పరిధిలో దుబచేర్ల వరకు, 216 ఏ రహదారి జోన్నాడ నుంచి గామన్ బ్రిడ్జి వరకు నిర్మిస్తున్నట్లు తే4లిపారు. మోరంపుడి ప్రాంతంలో తలపెట్టిన పై వంతన నిర్మాణం కోసం ప్రతిపాదన ఏ దశలో ఉందో కలెక్టర్ మాధవీలత సమీక్షించారు. జాతీయ రహదారుల నిర్వహణా సామర్థ్యము ఆయా ప్రభుత్వ శాఖలు పెంచుకోవలసి ఉందన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా చేపట్టవలసిన కొద్దిపాటి పెండింగ్ పనులను, భూసేకరణ తదితర పనుల్ని కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకుని వెళ్ళారు. అదే విధంగా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల రహదారులకు జాతీయ రహదారి అనుసంధానంగా ఉన్న వాటి పై సమగ్ర నివేదిక కోరారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, ఎన్ హెచ్ పిడి. డి.నరేంద్రనాథ్ లు పాల్గొన్నారు.
addComments
Post a Comment