జిల్లాలో ఈ రోజు నిర్వహించిన రెండవ ఏడాది ఇంటర్ పరీక్షలు ప్రశాంతం జరిగాయన్నారు.

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


రెండవ సంవత్సరం పార్ట్- III గణితం పేపర్- II A , బోటనీ పేపర్- II,  సివిక్స్ పేపర్-II పరీక్షలకు ఇంటర్ విద్యార్ధులు 15,484 మంది , ఓకేషనల్ విద్యార్థులు 1,639 మంది పరీక్షకు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  



జిల్లాలో ఈ రోజు నిర్వహించిన రెండవ ఏడాది ఇంటర్  పరీక్షలు ప్రశాంతం జరిగాయన్నారు.


ఈ సందర్భంగా కలెక్టర్  మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో 49 పరీక్షా కేంద్రాల లో ఇంటర్ రెండవ సంవత్సరం  పరీక్షా కోసం 158, 66 మంది, ఒకేషనల్ కోర్సు రెండవ ఏడాది పరీక్షలకు  1,789 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.. రాజమండ్రి డివిజన్ పరిధిలో 32 కేంద్రాలలో ఇంటర్ కి   11,339 మందికి గాను 11,081 మంది హాజరు కాగా  258 మంది హాజరు కాలేదన్నారు.  ఒకేషనల్ కోర్సు కి సంబందించిన 1,013  కి గానీ మందికి గాను 921 మంది హాజరు కాగా 92 మంది హాజరు కాలేదని తెలిపారు.


కొవ్వూరు డివిజన్ పరిధిలో పరిధిలో 17  కేంద్రాలలో ఇంటర్ పరీక్షలకి 4,527 మందికి గాను 4,403 మంది హాజరు కాగా  124 మంది హాజరు కాలేదన్నారు.  ఒకేషనల్ కోర్సు కి సంబందించిన కి  776 మందికి గాను   718 మంది హాజరు కాగా 58  మంది హాజరు కాలేదని తెలిపారు. 




మే 11 న బుధవారం నిర్వహించాల్సిన ఇంటర్ మొదటి  ఏడాది  గణితం పేపర్- I A , బోటనీ పేపర్- I,  సివిక్స్ పేపర్-I పరీక్షలను  వాయిదా వేసి ఉన్నందున మే 25 వ తేదీన యధావిధిగా విద్యార్థులకు గతంలో కేటాయించిన కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఇంటర్మీడియేట్ బోర్డ్ తెలియచేయడం జరిగిందన్నారు.


Comments