పకడ్బంధీగా పదోతరగతి పరీక్షలు
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
బొండపల్లి మండలంలో పరీక్షా కేంద్రాల తనిఖీ
బొండపల్లి (విజయనగరం), మే 02 (ప్రజా అమరావతి) ః
మరింత పకడ్బంధీగా పదోతరగతి పరీక్షలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. బొండపల్లి మండలంలోని పలు పదోతరగతి పరీక్షా కేంద్రాలను, సోమవారం కలెక్టర్ సూర్యకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు త్రాగునీటి సదుపాయం కల్పించాలని, గదుల్లో గాలీ, వెలుతురూ ఉండేలా చూడాలని సూచించారు. చూసిరాతలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, పటిష్టంగా పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు.
గాయత్రి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్నికలెక్టర్ ముందుగా తనిఖీ చేశారు. సెంటర్ ఛీఫ్ సూపరింటిండెంట్ బి.ఆదినారాయణను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సెంటర్ కు 239 మంది విద్యార్థులను కేటాయించగా, 237 మంది హాజరయ్యారని ఆయన తెలిపారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ కేంద్రానికి 206 మంది విద్యార్థులను కేటాయించగా, అందరూ హాజరయ్యారని సెంటర్ ఛీఫ్ సూపరింటిండెంట్ పి.బాబూలాల్ తెలిపారు. ఈ పాఠశాలలో కిచెన్ షెడ్‌ను నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం గొట్లాం జెడ్‌పి ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఛీఫ్ సూపరింటిండెంట్ వి.జ్ఞానశంకర్‌ను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ సెంటర్‌కు 127 మంది విద్యార్థులను కేటాయించారని, అందరూ హాజరయ్యారని ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో బొండపల్లి తాశీల్దార్ మిస్రా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment